ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీపై రాజ్యాంగని మార్చబోతున్నామని ఆరోపణలు చేస్తుందంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. 80 సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రతిపక్షాలపై ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి చూస్తుంటే.. బీజేపీ ప్రభుత్వానికి 370 సీట్లు అంతకంటే ఎక్కువగా సీట్లు కూడా గెలుచుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: Jai Hanuman : ‘జై హనుమాన్’ నుంచి స్పెషల్ అప్డేట్.. వైరల్ అవుతున్న పోస్టర్..
కేవలం ఉత్తర భారతదేశంలో మాత్రమే కాకుండా.. దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. ఇక నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం కచ్చితం అని ఆయన పేరుకున్నాడు. ఈ నేపథ్యంలో దళితులను, మైనార్టీలను ప్రతిపక్షాలు తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. ఇలాంటివి ఎన్ని లేనిపోని ఆరోపణలు చేసిన.. విజయం మాత్రం బీజేపీదే నని ఆయన తెలిపారు. ఇదివరకు 80 సార్లు రాజ్యాంగాన్ని మార్పులు చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పాపానికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీ రాజ్యాంగం మార్చబోతుందంటూ మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు.
Also Read: CM YS Jagan: తెలుగు ప్రజలకు సీఎం జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
ఇక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2024 డిసెంబర్ నాటికి భారత దేశంలో జాతీయ రహదారులు అమెరికాతో సమానంగా ఉండబోతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే ఐదేళ్లలో దేశంలో విప్లవాహక మార్పులు రాబోతున్నాయని.. దేశం మరింత బలపడుతుందని ఆయన చెప్పుకోవచ్చారు. వచ్చే ఐదేళ్లలో చైనా అమెరికాలను వదిలి నెంబర్ వన్ సంతానంలో భారతదేశం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.