West Bengal: బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరు నిందితులను పశ్చిమ బెంగాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. అయితే ఈ పరిణామం బెంగాల్లో రాజకీయ రచ్చకు దారి తీసింది.
రేపటి నుంచి బాలకృష్ణ రాష్ట్ర పర్యటన ప్రారంభం అవుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెల్లడించారు.. ఇక, బాలయ్య యాత్ర కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు.. ''స్వర్ణాంధ్ర సాకార యాత్ర'' పేరుతో నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర నిర్వహించనున్నారు..
దేశానికి సంబంధించిన ఎన్నికలు వచ్చేనెల జరగనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవి దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలని ఆయన వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గ్రామాల్లో ఉన్న ముసలి వారు కూడా మోడీకే ఓటు వేస్తాం అంటుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు వడ్లు కొనడం లేదని ఎంపీ బండి సంజయ్‌కి రైతులు మొరపెట్టుకున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
BRS MLA Harish Rao on Medak BJP Candidate Raghunandan Rao: దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం ఒక్క బీజేపీ పార్టీకే సాధ్యం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ అంత భక్తుడు ఎవరన్నా ఉన్నారా?.. ఆయన చేసిన యజ్ఞ, యాగాదులు ఎవరన్నా చేశారా? అని ప్రశ్నించారు. దేవుడిపై ఎంతో భక్తి ఉన్న కేసీఆర్.. ఏనాడు రాజకీయాలకు వాడుకోలేదన్నారు. రఘునందన్ రావు డోఖా చేయడంతోనే దుబ్బాకలో ప్రజలు ఓడగొట్టారు..…
Medak Parliament Leaders complaining against each other: తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య ఫిర్యాదుల రాజకీయం కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. గులాబీ నేతలపై అసభ్య పదజాలం వాడారని ఎన్నికల కమిషన్, పోలీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దాంతో సంగారెడ్డి టౌన్ పోలీసులు రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు.…