రైతులను ఆదుకొనే ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కులం, మతం పేరు మీద రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు.
సీఎంకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ముఖ్యమంత్రిపై దాడి జరుగుతుంటే అధికారులు నిద్ర పోతున్నారా.. అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ను విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆయన పోటీ చేస్తున్న వయనాడ్ లోక్సభ స్థానంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు.
తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, నవోదయ స్కూళ్లు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపింది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమ కార్యాచరణ ప్రారంభించాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ ఓట్లు అర్జిస్తోంది.
కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ రాత్రి బాగా నిద్రపోవడానికి 'ఒక పెగ్' తీసుకోవాలని కర్ణాటక బీజేపీ నేత సంజయ్ పాటిల్ సూచించి వివాదం రేకెత్తించారు.
సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 16న మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ సభ నిర్వహించే సభ స్థలిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. జనసమీకరణ, ఏర్పాట్లపై స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీజేపీ తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో…
2024 లో జరగబోయే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు ఆదివారం నాడు ఆరోపించాయి. ఎన్నికల పత్రంలో చేసిన వాగ్దానాలు “అబద్ధాలతో నిండి ఉన్నాయి., అలాగే అవి అవిశ్వసనీయమైనవి అని ఆరోపించాయి. మేనిఫెస్టోలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని కాషాయ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు వారు ఆరోపించారు. బీజేపీ మేనిఫెస్టోలో పేదలు, యువకులు, రైతులు, మహిళలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల పత్రాన్ని విడుదల చేస్తూ., తమ ప్రభుత్వం ఏకరూప పౌర నియమావళిని (యూసీసీ)…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇది హేయమైన చర్య అని ఆమె ఖండించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడు ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అంటూ ఆమె తెలిపారు.
BRS KTR: రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు అంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.