నేడు శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇవాళ ( బుధవారం ) శ్రీరామ నవమి శోభయాత్రకు అనుమతి లేదన్న లేఖను పోలీసులకు రాజాసింగ్ అందజేశారు. ఎవరు అనుమతి ఇచ్చిన ఇవ్వకున్నా శ్రీరామ నవమి శోభయాత్ర చేసి తీరుతానంటున్నారు. 45 రోజుల క్రితం పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు వచ్చి పర్మిషన్ లేదంటే ఎలా?.. ఇన్ని రోజుల సంధి పోలీసులు ఏం చేశారు?.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందులో పండుగల పైన అణిచివేత ఉంటుందని మేము ముందే ఊహించాం.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, కేరళ రాష్ట్రలలో సైతం ఇదే విధంగా హిందూ పండుగలు పైన కేసులు బుక్ చేస్తున్నారు.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గోషామాహల్ లోని ఆకాష్ పురి హనుమాన్ దేవాలయం నుంచి శోభాయాత్ర చేసి తీరుతాను అని రాజాసింగ్ వెల్లడించారు. ఈ శోభ యాత్రను ఎవరు పాలేరు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సూచన మీరు హిందూ పండుగలను అడ్డుకోవాలని ఉంటే గత సీఎంకి వచ్చిన పరిస్థితి మీకు వస్తుంది అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
Read Also: KKR vs RR: బట్లర్ వీరబాదుడు.. రాజస్థాన్ ఘన విజయం
ఇక, నేడు శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర వేడుకగా నిర్వహించనున్నారు. శోభాయాత్ర కోసం నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నేటి ఉదయం 11 గంటలకు శోభాయాత్ర ప్రారంభం అవుతుందని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శ్రీరాముడి ప్రధాన ఊరేగింపు సీతారాంబాగ్ ఆలయం నుంచి రామకోటిలోని హనుమాన్ వ్యాయామ శాల స్కూల్ వరకు కొనసాగతుందని రూట్ మ్యాప్ ఇచ్చారు.
Read Also: Mamitha Baiju : ఐశ్వర్య రాయ్ పాటకు మమితా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూశారా?
అయితే, శోభాయాత్రకు ప్రత్యామ్నాయ మార్గం చూపించిన పోలీసులు.. దీన్ని సవాల్ చేస్తూ కేసరి హనుమాన్ సంఘటన్ ప్రతినిధి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ బి విజయసేన్.. కేసరి హనుమాన్ ఆలయం నుంచి కులుసంపురా ప్రభుత్వ పాఠశాల మీదుగా గంగా పరమేశ్వరి ఆలయానికి శోభయాత్ర చేరుకుంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.. ఇక, ఈ మార్గాల్లో వెళితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. పోలీసులు సూచించిన మార్గాల్లోనే శోభయాత్ర నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.