సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్ పూర్ లో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజాఆశీర్వాధ బహిరంగ సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్ ని బొంద పెడుతామన్నారు. బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై క్రిమినల్ కేసు పెట్టాలి అని తెలిపారు. పాలన గాలికి వదిలేసి.. ప్రతిపక్ష నేతల ఇంటి చుట్టూ తిరిగి కండువాలు కప్పే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు.. కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ పాలన వద్దని జనాలు అంటున్నారు.. అప్పుడు చేతులు మొక్కి ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు కాంగ్రెస్ నేతలు.. బీజేపీ తెలంగాణాకి ఒక్క పని చేయలేదు అని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: Aamir Khan : పోలీసులకు అమీర్ ఖాన్ ఫిర్యాదు.. ఎఫ్ఐఆర్ నమోదు.. అసలేమైందంటే?
కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీ నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు.. ఎవరికైనా అయ్యిందా..? అని ప్రశ్నించారు. రుణమాఫీ అయ్యినోళ్లు కాంగ్రెస్ కే ఓటేయండి.. కానోళ్లు మాత్రం బీఆర్ఎస్ కే ఓటేయండి అన్నారు. 2500 కి వడ్లు కొంటానని చెప్పిన రేవంత్ ఇప్పుడు కొనాలా..? వద్దా..? అని ఆలోచిస్తున్నాడు.. రైతు బంధు 15 వేలు ఇస్తానని చెప్పి ఇచ్చాడా?.. ప్రతి మహిళకు 2500 ఇస్తానని చెప్పి మంగళం పాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి.. కళ్యాణ లక్ష్మీ పథకానికి తులం బంగారం అదనంగా ఇస్తానని అన్నాడు కానీ.. ఇప్పటి వరకు ఇవ్వలేదని సిద్ధిపేట ఎమ్మె్ల్యే హరీష్ రావు తెలిపారు.