Off The Record: హుజూర్నగర్ బీజేపీలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. నేతల మౌనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ద్వితీయశ్రేణి నాయకులు. మరీ ముఖ్యంగా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగి ఓడిపోయిన… హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి పట్టీ పట్టనట్టుగా ఉండటం చూసి ఏం చేయాలో పాలుపోవడం లేదట కేడర్కు. 2019లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు సైదిరెడ్డి.. 2023 లోకూడా బీఆర్ఎస్ నుండి హుజూర్ నగర్ అభ్యర్దిగా బరిలోకి…
Madhavi Latha: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో రాష్ట్ర రాజధానిలో రాజకీయ వాతావరణం వేడి ఎక్కింది. అయితే ప్రముఖ రాజకీయ పార్టీలు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఎవరిని బరిలోకి దించాలని తెగ చర్చలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత మాధవీ లత జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు సంబంధించి ఎన్.టి.వి తో ముఖాముఖిగా చర్చించారు. ఈ సందర్బంగా మే మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్ధిగా అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.…
Russia: పాకిస్తాన్ తయారీ ఫైటర్ జెట్ JF-17 కోసం రష్యా ఇంజన్లు ఇస్తోందనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. మోడీ దౌత్య విధానం విఫలమైందని ఆరోపించింది. అయితే, ఈ ఊహాగానాలను రష్యా ఖండించింది. నిజానికి, JF-17 యుద్ధ విమానం కోసం పాకిస్తాన్కు RD-93 ఇంజిన్లను సరఫరా చేయడం వల్ల వాస్తవానికి భారతదేశానికి ప్రయోజనం చేకూరుతుందని రష్యన్ రక్షణ నిపుణులు చెబుతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లా కేటాయించబడింది. ఏడాది తర్వాత కొత్త బంగ్లాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవంబర్ 4, 2024న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. వాస్తవంగా 10 రోజుల్లోనే జాతీయ అధ్యక్షుడికి ఢిల్లీలో అధికారికంగా ప్రభుత్వ బంగ్లాను ఏర్పాటు చేయాలి..
ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అవుననే సమాధానం వస్తుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన మైథిలి ఠాకూర్.. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు బీజేపీ నేతల సమావేశాలే ఉదాహరణగా ఉన్నాయి.
బీహార్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. శని, ఆదివారాల్లో ఎన్నికల బృందం బీహార్లో పర్యటించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది.
మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతేడాది అల్లర్లతో మణిపూర్ అట్టుడికింది. పదులకొద్ది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి పదవికి బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది.
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ప్రధాన పార్టీలు సన్నాహాలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు ఈ ఎన్నికను ప్రస్టేజ్గా తీసుకుని.. కమిటీలు, సబ్ కమిటీలు, సర్వేలు, సమీక్షలతో బిజీగా మారిపోగా, బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి, జోరుగా ప్రచారం కూడా చేస్తోంది. అయితే, జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిని ఎంపిక చేయడానికి నలుగురి పేర్లను కాంగ్రెస్ ప్రతిపాదించింది.
Karnataka: బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటకలో పెను రాజకీయ మార్పులు వస్తాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర అంచనా వేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మధ్య అధికార పోరాటం జరుగుతుంద జోష్యం చెప్పారు. తాజాగా విజయేంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు గురించి బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని గుర్తు చేశారు. సిద్ధరామయ్య తొందరపడుతున్నట్లు కనిపిస్తున్నారన్నారు.
BJP MLA Katipally: బీజేపీ పదాధికారుల సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.