K. Laxman: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌తో ముడి పడి ఉంది
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌తో ముడి పడి ఉంది
- బీహార్‌లో గెలిచేది ఎన్డీఏ కూటమినేనన్న లక్ష్మణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌తో ముడి పడి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల అజెండా మజ్లిస్‌ను పెంచి పోషించడమే. డబ్బు కుమ్మరించడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్‌ను గెలిపించే ప్రయత్నం జరుగుతుంది. చొరబాటుదారులు, రోహింగ్యలు పెత్తనం చలాయిస్తున్నారు. ఈ ఎన్నికను బీజేపీ కార్యకర్తలు సవాల్‌గా తీసుకోవాలి.’’ అని కోరారు.
ఇది కూడా చదవండి: Harish Rao: రాహుల్‌గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువగా నటిస్తున్నారు.. హరీశ్‌రావు ఫైర్
Also Read
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
- CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక 'ఆర్యదాన్ ముహమ్మద్' పురస్కారం
- Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
‘‘తెలంగాణలో ఒక్క ఏడాదిలో 5 వందల హత్యలు జరిగాయి. పోలీసులకే రక్షణ లేదు. గన్ కల్చర్ పెరిగిపోయింది. శాంతి భద్రతలు క్షీణించిపోయాయి. ఇక బీఆర్ఎస్‌ది గత చరిత్రనే.. మళ్లీ గెలిచేది లేదు. కాంగ్రెస్ మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది. మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన మీద పట్టు కోల్పోయారు. ఐఏఎస్‌లు బలవంతంగా పదవి విరమణ చేసే పరిస్థితి వచ్చింది. బీసీ నినాదం ఎత్తుకుని రాహుల్ గాంధీ అభాసు పాలయ్యారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు. మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాహుల్ కుటుంబం. మోడీ ఓటు బ్యాంక్‌ను చీల్చే కుట్ర. బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే అది మోడీ ప్రభుత్వంతోనే.’’ అని లక్ష్మణ్ అన్నారు.
‘‘బీహార్‌లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలువబోతుంది. జంగల్ రాజ్‌గా ఉన్నా బీహార్ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుంది. రాహుల్ గాంధీ విదేశీ కుట్ర దారులతో చేతులు కలిపారు. దేశాన్ని మతాల పేరుతో విడగొట్టి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడుతున్నారు. ఓటు చోరీ నినాదం కాంగ్రెస్‌కి బూమరంగ్ అయింది. దొంగ ఓట్లను చేర్పించి దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్ అరుస్తుంది. తెలంగాణలో ప్రజలు కాచుకుని చూస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పారదర్శకత, జవాబు దారి పాలన తెలంగాణలో కూడా రావాలని చూస్తున్నారు.’’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Rohini Kalam: విషాదం.. జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణం చెందారు. దీంతో జూబ్లీహిల్స్‌కు బైపోల్ అనివార్యమైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఫలితం మాత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీ నువ్వానేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ పోటీ పడుతున్నారు.
తాజావార్తలు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!