Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థి పేరును ప్రకటించడంతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ హైకమాండ్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న లంకల దీపక్ రెడ్డిని ఉప ఎన్నిక బరిలో తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఇద్దరు మహిళా నేతలు సహా పలువురు సీనియర్ల పేర్లను పరిశీలించినప్పటికీ.. వివిధ సమీకరణాలను…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తప్పు చేశారా? లేక ఆయన చర్య కరెక్టేనా? అది పార్టీకి లాభమా? నష్టమా? భిన్నాభిప్రాయాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయి? అసలింతకీ ఏం చేశారాయన? కొందరు ఎస్ అంటే… మరి కొందరు నో అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా లేఖలు రాశారు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అందులో క్లారిటీ ఇచ్చేశారట. కొంతమంది సీనియర్ నాయకులు సైతం…
Maithili Thakur: ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ బీజేపీలో చేరారు. బీహార్‌లో వ్యాప్తంగా మైథిలి జానపద సింగర్‌గా ఈమెకు పేరుంది. బీహార్ ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె వచ్చే ఎన్నికల్లో అలీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో చేరాలనుకుంటున్నట్లు ఆమె గతంలో చెప్పింది.
Bihar elections: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీయే పార్టీలో పొత్తులు కూడా పూర్తయ్యాయి. మొత్తం 243 సీట్లకు గానూ బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తుంగా, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ(రామ్ విలాస్) 29 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగిలిన స్థానాలు ఎన్డీయే మిత్రపక్షాలకు దక్కాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ వేశారు. ‘కారు’ గుర్తు ఉన్న పార్టీ (బీఆర్ఎస్) వాళ్ల పరిస్థితిని వాళ్లే చూసుకోవాలని విమర్శించారు. వాళ్ల కారు ఇప్పటికే రిపేర్ చేయడానికి కూడా పనికి రాకుండా షెడ్డులో పడిందని ఎద్దేవా చేశారు. కనీసం సెకండ్ హ్యాండ్లో కూడా కారును కొనడానికి ఎవరూ లేరని బండి విమర్శలు చేశారు. ఈ మేరకు బండి సంజయ్ తన ఎక్స్‌లో పోస్ట్…
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విదేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కొంత మందికే విద్యా హక్కు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత కులాల ప్రయోజనాలకే ప్రభుత్వ సేవ చేస్తోందని.. మధ్యతరగతి, దిగువ కులాలు, గిరిజన వర్గాల చరిత్ర, సంప్రదాయాలు, సహకారాలను విస్మరిస్తుందని ధ్వజమెత్తారు.
Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ల ఎన్డీయే కూటమి సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలో పోటీ చేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు దక్కాయి. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయి. 2020 బీహార్ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో…
Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఓ ‘‘చొరబాటుదారుడు’’ అంటూ మండిపడ్డారు. ఆయన ఉత్తరాఖండ్ నుంచి, ఉత్తర్ ప్రదేశ్‌లోకి వచ్చాడని, ఆయన సొంత రాష్ట్రానికి తిరిగి పంపించాలని అన్నారు. రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా ఆదివారం లక్నోలోని లోహియా పార్క్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ వద్ద నకిలీ లెక్కలు ఉన్నాయని, వాటిని నమ్మితే, తప్పిపోతారని అన్నారు.
రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల సంఘం రేపు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. రేపటి నుంచి మొదలు 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 22 న నామినేషన్లు పరిశీలన కాగా.. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా ఎన్నికల సంఘం. షేక్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. Also Read:…
యువతకు ఇష్టమైన నేత, పవర్ స్టార్‌గా పేరు గాంచిన భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్ తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2024, మే నెలలో ఎన్డీఏ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థిగా కరకట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు