Bihar Elections: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అధికార బీజేపీ+జేడీయూల ఎన్డీయే కూటమి, ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘటబంధన్ కూటమిలు ప్రచారాలు మొదలుపెట్టాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే కూటమి భావిస్తుంటే, దశాబ్ధానికి పైగా అధికారానికి దూరంగా ఉన్న ఆర్జేడీ గెలుపు రుచి చూడాలని అనుకుంటోంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6న ,నవంబర్ 11న రెండు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుంది.
Read Also: Sweden: 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం ‘‘తక్కువ సమయమే’’ జరిగిందట.. స్వీడన్ కోర్టు తీర్పుపై ఆగ్రహం..
అయితే, బీహార్ ఎన్నికలు దేశ రాజకీయాలపై చాలా మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికల్ని అన్ని పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. బీజేపీ వరస విజయాలకు బ్రేక్ వేసేలా చేయాలని ఇండియా కూటమి భావిస్తోంది. అయితే, మరోవైప ఈ ఎన్నికలపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. సట్టా బజార్‌లో బెట్టింగ్ ట్రెండ్స్ ప్రకారం..బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 140-145 సీట్లు వస్తాయని, మహాఘటబంధన్ కూటమికి 80 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేస్తున్నారు.
బెట్టింగ్ మార్కెట్ ప్రకారం, మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఫలితాలు సరైనావా కావా అని నవంబర్ 14న తెలుస్తుంది. గగంలో బెట్టింగ్ మార్కెట్ అంచనాలు విఫలమైన సందర్భాలు కూడా ళఉన్నాయి. హర్యానా ఎన్నికల సమయంలో అంతా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని బెట్టింగ్ జోరుగా వేసినప్పటికీ, చివరకు బీజేపీ అధికారంలోకి వచ్చింది.