Gudivada Amarnath: కక్ష పూరితంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్రంలో కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిశారు మాజీ మంత్రి అమర్నాథ్,…
AP Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రోటోకాల్ వివాదం సద్దుమణిగింది.. మండలి చైర్మన్ కు ప్రోటోకాల్ విషయంలో జరిగిన పరిణామాలను దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇవ్వడంతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాంతించారు.. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.. మరోవైపు, ఈ పరిణామాలపై స్పందించిన మండలి చైర్మన్ మోషేర్‌రాజు.. వ్యక్తులకు, వ్యవస్థలకు, అధికారులకు…
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు దసరా కానుక అందింది. శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
Sonam Wangchuk: రాష్ట్ర హోదా కోరుతూ, లడఖ్ వ్యాప్తంగా హింసాత్మక అల్లర్లు జరిగాయి. భద్రతా బలగాలు, బీజేపీని టార్గెట్ చేస్తు ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో నలుగురు మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు.ఈ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా చేయబడ్డాయని లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా ఆరోపిస్తూ, లేహ్ వ్యాప్తంగా ఖర్ఫ్యూ విధించారు. అల్లర్ల వెనక ఉన్న ప్రతీ వ్యక్తిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీల నేతలు విచిత్రమైన మానసిక వ్యాధి తో బాధపడుతున్నారని అన్నారు. వాళ్లకు బిజెపి ఫోబియా పట్టుకుందన్నారు. చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. బిజెపికి తెలంగాణ లో ఎవరితో కలవాల్సిన అవసరం లేదన్నారు. కెసిఆర్, కేటీఆర్, బిఆర్ఎస్, కాంగ్రెస్ లతో బిజెపి…
తెలంగాణలో నేషనల్ హైవే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణాలో జాతీయ రహదారులు అత్యంత వేగవంతంగా, సమర్థవంతంగా పురోగతి సాధిస్తున్నాయని తెలిపారు. 2500 కీ మీ మాత్రమే జాతీయ రహదారులు ఉండేవని.. ఈ పదేళ్లలో రెండింతలు అయిందన్నారు. ఇప్పటికే 5 వేల కిలోమీటర్లకు పైగా పూర్తి అయిందని తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలతో జాతీయ రహదారుల అనుసంధానం జరుగుతోందన్నారు. Also Read:Illegal Sand Transportation: ఆంధ్రా…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఆ మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఎంపిక చేయొచ్చని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం జేపీ నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
లడఖ్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ కౌన్సిలర్ ఫుంటోగ్ స్టాన్జిన్ త్సెపాగ్ హస్తం ఉన్నట్లుగా బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా ఎక్స్‌లో ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. రాహుల్‌గాంధీ ఇలాంటి అశాంతిని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కౌన్సిలర్.. బీజేపీ కార్యాలయం, వాహనాలు తగలబెట్టాలని ప్రేరేపించారని బీజేపీ ఆరోపించింది.
కరీంనగర్లో ఒక్క బడి తేలేదు అని, కనీసం గుడి కూడా తేలేదని.. అయినా కరీంనగర్ వాసులు బీజేపీకే ఓటు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ మోసం దేవుడు రాముడికి కూడా అర్థం అయిందని, అందుకే అయోధ్యలో బీజేపీని ఓడగొట్టారని ఎద్దేవా చేశారు. అవసరం లేకున్నా వేసిన జీఎస్టీని తీసేసి పండుగ చేసుకోండి అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈరోజు కేటీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ రోహిత్ రెడ్డి, గౌతమ్ రెడ్డిలు బీఆర్ఎస్…
గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోడీ విమర్శించారు. మోడీ సోమవారం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇటానగర్ సభలో మోడీ ప్రసంగించారు.