BJP: రాబోయే బీహార్ ఎన్నికల్లో బురఖా ధరించిన ఓటర్లను చెక్ చేయాలని బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆర్జేడీ ఆరోపించింది. పోలింగ్ బూతుల్లో బురఖా ధరించిన మహిళల్ని ధ్రువీకరించాలని నిన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో జరిగిన సమావేశంలో బిజెపి చీఫ్ జైస్వాల్ కోరారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఈరోజు, రేపు బీహార్‌లో పర్యటించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం తెలంగాణ బీజేపీ కొత్త ఎత్తులేస్తోందా? ఇన్నాళ్ళు… ఎక్కడ, ఎందుకు వెనకబడ్డామో… ఆ పార్టీకి ఇప్పుడు తెలిసొచ్చిందా? అందుకే ఇప్పటికైనా మించిపోయిందేం లేదనుకుంటూ… పార్టీ లీడర్స్‌కు స్పెషల్ మైకులు అందిస్తోందా? ఇంతకీ ఏ విషయంలో బీజేపీ రియలైజ్ అయింది? లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌లో జనానికి ఏం చెప్పాలనుకుంటోంది? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కొత్త అస్త్రానికి పదును పెడుతోందట. ఇన్నాళ్ళు అనుసరించిన వ్యూహానికి భిన్నంగా ఇప్పుడు కేంద్ర ప్రాధాన్యతను వివరిస్తూ…తమను…
బీజేపీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందంటూ ఫైరయ్యారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కరూర్ ఘటనను బీజేపీ వాడుకుంటోంది తప్ప.. తొక్కిసలాట గురించి మాత్రం ఆందోళన లేదని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నారు. ఇక ప్రధాని మోడీ ఆధునిక రావణుడికి చిహ్నం అని తెలిపారు. ప్రధాని మోడీ ఎక్కువ కాలం కొనసాగలేరని.. త్వరలోనే ఆయన లంకలో అగ్నిప్రమాదం జరుగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (83)కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసినట్లుగా ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఖర్గే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Somu Veerraju: ప్రజలు విదేశీ వస్తువులను విడనాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు.. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఏర్పాటుచేసిన ఖాదీ సంతను ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. . రెండు రోజులు పాటు ఖాదీ సంత నిర్వహించనున్నారు.. ఖాదీ ఫర్ నేషన్ – ఖాదీ ఫర్ ఫ్యాషన్ నినాదంతో ఈ ఖాదీ సంత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా…
Chidambaram: 2008 ముంబై ఉగ్రవాద దాడుల గురించి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. 175 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘోర ఉగ్రవాద ఘటన తర్వాత, అప్పటి యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలని భావించిందని, అయితే అమెరికా ఒత్తిడి మేరకు తాము ఆ పనిచేయలేదని చిదంబరం అన్నారు.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం నడుస్తోంది. నిన్న బరేలీలో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత, పెద్ద ఎత్తున గుంపు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థిని కంట్రోల్ చేశారు. ఈ వివాదం కాన్పూర్‌లో మొదలైంది. తర్వాత కౌశాంబి లాంటి పట్టణాలకు చేరింది.