బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీకి బిగ్ షాక్ తగిలింది. ఆర్జేడీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు ప్రతిమా కుష్వాహా పార్టీకి గుడ్‌బై చెప్పారు. శనివారం ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అధికార-ప్రతిపక్ష కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తు్న్నాయి. విమర్శలు-ప్రతి విమర్శలతో వేడి పెంచుతున్నారు. ప్రధాని మోడీ శుక్రవారం.. విపక్ష కూటమి లక్ష్యంగా విమర్శలు గుప్పించగా... తాజాగా ప్రధాని మోడీని టార్గెట్‌గా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతి దాడికి దిగారు.
Bihar Elections: బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయితో లవ్‌లో ఉన్నానని ప్రకటించిన తర్వాత తేజ్ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆయన జనశక్తి జనతాదళ్ (JJD) పార్టీని పెట్టారు.
మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ప్రకటించిన తర్వాత ఎన్డీఏ కూటమి వైఖరిలో కూడా మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
మహాఘట్బంధన్లో ఉన్నవారంతా నేరస్థులేనని.. వారంతా బెయిల్‌పై తిరుగుతున్నారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రధాని మోడీ బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. శుక్రవారం ఉదయం భారతరత్న కర్పూరి ఠాకూర్ స్వగ్రామం సమస్తిపూర్‌కు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పలకరించారు. అటు తర్వాత సమస్తిపూర్ నుంచి ఎన్నికల ర్యాలీని మోడీప్రారంభించారు. మోడీ వెంట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ నేతలు ఉన్నారు.
ప్రధాని మోడీ శుక్రవారం బీహార్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్ గ్రామం సమస్తిపూర్ నుంచి మోడీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తొలుత కర్పూరి ఠాకూర్‌కు మోడీ నివాళులర్పించనున్నారు.
Off The Record: ప్రశ్నిస్తా…. ప్రశ్నిస్తా… తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తూనే ఉంటా… ఇదీ జనసేన అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టైల్. అధికారంలో ఉన్నానా, ప్రతి పక్షంలో ఉన్నానా అన్నది డజంట్ మేటర్. తప్పు జరిగిందా లేదా అన్నదే నాకు ముఖ్యం అంటారాయన. అందుకు తగ్గట్టే… ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా తన ప్రశ్నావళిని ఓపెన్‌గానే ఉంచారాయన. దాన్నే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని మిగతా కొందరు సహచరులు ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో పవన్‌కు…
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్రమోడీ దిగారు. బీహార్‌లోని బీజేపీ కార్యకర్తలతో ప్రధాని గురువారం మాట్లాడుతూ.. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని, ఆ కాలపు అనుభవానలు యువతరానికి అందించాలని రాష్ట్రంలోని సీనియర్ ఓటర్లను ఆయన కోరారు
Karnataka: కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇటీవల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూర్ సౌత్ ఎంపీ, బీజేపీ తేజస్వీ సూర్యను ‘‘అమావాస్య’’గా పిలిచారు. దీనికి తేజస్వీ స్పందిస్తూ.. సీఎం సిద్ధరామయ్య ‘‘కర్ణాటకకు గ్రహణం’’ అని అన్నారు. సిద్ధరామయ్య పాలన రాష్ట్రానికి గ్రహణం లాంటిది అని విమర్శించారు. Read Also: CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అత్యవసర నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు.. తనను అమావాస్య, పౌర్ణమిగా…