Haryana CM: హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం!
- సీఎంగా సైనీ ప్రమాణ స్వీకారం
- హాజరైన ప్రధాని మోడీ
- ప్రమాణస్వీకార కార్యక్రమంకు ఏపీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayab Singh Saini Oath: హర్యానా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం పంచకులలోని షాలిమార్ మైదానంలో జరిగిన వేడుకలో గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమి నేతలు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
హర్యానాలో అక్టోబర్ 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ విజయం సాధించింది. 90 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లు గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టింది. ఇక్కడ కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చిన నాయబ్ సింగ్ సైనీ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపింది. బుధవారం జరిగిన శాసనసభా పక్ష భేటీలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
Also Read: Miss India 2024: ‘మిస్ ఇండియా’గా నిఖిత పోర్వాల్!
శాసనసభా పక్ష భేటీలో మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్‌లు నాయబ్ సింగ్ సైనీ పేరును ప్రతిపాదించగా.. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో హర్యానా సీఎంగా నేడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో సీఎంగా సైనీ ఈ ఏడాది మార్చిలో మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!