Nayab Singh Saini: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వరుసగా మూడో విజయాన్ని సాధించి పెట్టిన నయాబ్ సింగ్ సైనీ ఈ నెల 15వ తేదీన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
Covid Scam: కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్-19 మహమ్మారి సమయంలో జరిగిన కుంభకోణంపై తీవ్ర వివాదం కొనసాగుతుంది. కోవిడ్ పరికరాలు, ఔషధాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపింది.
కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి, మాజీ డీజీపీ శ్రీలేఖ బీజేపీలో చేరారు. ధవారం తిరువనంతపురంలోని ఆమె నివాసంలో బీజేపీ కేరళ అధ్యక్షుడు కే సురేంద్ర సమక్షంలో బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అధికారికంగా బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. శ్రీలేఖ.. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. రాష్ట్ర కేడర్‌లో మొదటి మహిళా ఐపీఎస్. ఇక 2020లో కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు.
Samajwadi Party: హర్యానా ఎన్నికల ఓటమి కాంగ్రెస్ పార్టీపై బాగానే కనిపిస్తోంది. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై సమీక్ష చేసుకోవాలని ఒమర్ అబ్దుల్లా సూచించారు.
Asaduddin Owaisi: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి, బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఈ ఓటమిపై కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇండియా కూటమి పార్టీలు హస్తం పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అహంకారం, అతివిశ్వాసమే కాంగ్రెస్‌ని దెబ్బతీసిందని ఉద్దవ్ ఠాక్రే శివసేన ఆరోపించింది. టీఎంసీ కూడా ఇలాంటి విమర్శలనే చేసింది.
జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని తెలిపారు. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనం.. ఎన్ని అపోహలు, ప్రచారాలు జరిగినా.. హర్యానా, జమ్మూ కాశ్మీరులో మంచి పరిపాలనపై నమ్మకంతోనే ఎన్డీఏను గెలిపించారన్నారు.
PM Modi: హర్యానాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. వరసగా మూడోసారి అధికారం చేపట్టబోతోంది. జమ్మూ కాశ్మీర్లో అధికారం చేపట్టలేకపోయినప్పటికీ 90 స్థానాల్లో 29 స్థానాలను సాధించింది. ఇక రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చావుదెబ్బతింది. రాహుల్ గాంధీ ప్రచారం, అగ్నివీర్ అంశం, నిరుద్యోగం, వినేష్ ఫోగట్ చేరిక, రైతు ఉద్యమాలు ఇలా ఏదీ కూడా బీజేపీ గెలుపుని ఆపలేకపోయాయి. 37 సీట్లలోనే కాంగ్రెస్ గెలిచింది. జమ్మూ…
RSS: బీజేపీ, తన మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కలిసి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి హర్యానా గెలుపే నిదర్శనం. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయలేదని, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో హర్యానాలో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందనే ఊహాగానాల నుంచి భారీ గెలుపు దిశగా పయణించింది. వరసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీ, తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్…
Congress: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అండతో కేవలం 6 సీట్లలో మాత్రమే గెలుపొందింది. జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఓడిపోయినప్పటికీ పార్టీ తన ఓట్లను, సీట్లను పెంచుకుంది. జమ్మూ ఏరియాలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ తర్వాత 29 స్థానాలు గెలిచి రెండో స్థానంలో ఉంది.
Haryana Elections: 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హర్యానాలో పదేళ్ల పాలన తర్వాత బీజేపీ గెలుపు అసాధ్యమనుకున్న చోట ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. మరోసారి కాంగ్రెస్‌కి ఘోర పరాభవం తప్పలేదు. ఇదిలా ఉంటే హర్యానా ఫలితాల అనంతరం ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ బలం 51కి చేరింది.