PM Modi To Attend Nayab Singh Saini Oath Ceremony: హర్యానాలో బీజేపీ ప్రభుత్వం మరి కొద్ది గంటల్లో కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంచకులలోని సెక్టార్ 5 దసరా గ్రౌండ్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నేతలు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. లక్ష మందికి పైగా పార్టీ కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది.
Also Read: IPL 2025 Auction: పృథ్వీ షాకు షాక్.. ముగ్గురినే రిటైన్ చేసుకున్న ఢిల్లీ!
హర్యానాలో అక్టోబర్ 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చిన నాయబ్ సింగ్ సైనీ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. బుధవారం జరిగిన శాసనసభా పక్ష భేటీలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్‌లు సైనీ పేరును ప్రతిపాదించగా.. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో హర్యానా సీఎంగా రెండోసారి సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో సీఎంగా సైనీ ఈ ఏడాది మార్చిలో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.