ఈ సంవత్సరం జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది రానున్న లోకసభ సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ముఖ్య నేతలతో కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. గత 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపి ఓడిపోయిన సుమారు 160 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసుకోవడంపై చర్చిస్తున్నారు.
గేదెను ట్రాలీ ఎక్కిస్తున్న ఓ వీడియోను షేర్ చేశారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. గేదెను ట్రాలీకి కట్టి.. దానిని వెనకనుంచి తన్నగానే వెంటనీ ట్రాలీలోకి ఎక్కేసింది.. ఇక, ఇలాంటి ట్రీట్‌మెంట్ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అవసరం అంటూ ఆయన కామెంట్ రాసుకొచ్చారు.. అంతేకాదు.. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్, తెలంగాణ బీజేపీని ట్యాగ్ చేసి ఆ ట్వీట్ చేశారు.
Bandi sanjay: ప్రజల్లో ఉంటూ, నిత్యం ఓటర్లను కలిసే వారికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావచ్చని బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివిధ రకాల నివేదికల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లు ఇస్తామని ప్రకటించారు.
రాంజీగోండు చరిత్రను వెలుగులోకి తెస్తామని బీజేపీప రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ బండి సంజయ్ అన్నారు. అలే నరేంద్ర వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ పై రాజకీయ దుమారం రేగుతుంది. అధికార, ప్రతిపక్ష మాటలు తూటాల్లా పేలుతున్నాయి. పేపర్ లీక్ విషయంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.
Off The Record: తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంపై ఢిల్లీలోని పార్టీ పెద్దలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా బీజేపీలో చేరికలపై టాప్ టు బాటమ్ కసరత్తు జరుగుతోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో.. ఎన్నికల తర్వాత కొందరు ఇతర పార్టీల నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకొన్నారు. బీజేపీ నాయకులు ఆశించినట్టు వరదలా చేరికలు లేకపోయినా.. అడపా దడపా చేరినవారు ఉన్నారు. ప్రత్యేకంగా చేరికల కమిటీ వేసినా అనుకున్నంత…