Sachin Pilot: బీజేపీ నేతలకు సచిన్ పైలట్ కౌంటర్.. వాస్తవాలు తెలుసుకోవాలంటూ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Pilot: మాజీ కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ తనయుడు.. సచిన్ పైలట్ తన తండ్రిపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా మట్డాడకండి.. ప్రజలకు చెప్పే టప్పుడు వాస్తవంగా ఏమీ జరిగిందో తెలుసుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రి బాంబ్‌లు వేసింది సొంత ప్రజలపై కాదని.. భారత్- పాకిస్థాన్ యుద్ధ సమయంలో అని.. అది కూడా బీజేపీ వారు చెప్పిన తేదిల్లో కాదని ట్విట్టర్ వేదికగా సచిన్ పైలట్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సచిన్ పైలట్ ట్విట్టర్ లో పోస్టులో చేశారు.
Read also: Rajanikanth : తన వీరాభిమానికి సాయం చేసిన తలైవా.
Also Read
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవ్య ట్విట్టర్‌లో సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్ మరియు సురేష్ కల్మాడీలపై సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరూ 1966, మార్చి 5న మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో బాంబు దాడి జరిపారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సచిన్ పైలట్ సీరియస్‌గా స్పందించారు. మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమేనని.. కానీ మీరు చెప్పిన డేట్లు, సమాచారం తప్పని ట్విట్టర్ వేదికగా సచిన్ పైలట్ స్పష్టం చేశారు. బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్‌లో “1966, మార్చిలో రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్‌లో మిజోరాం రాజధాని ఐజ్వాల్‌పై బాంబుల వర్షం కురిపించారు. తదనంతర కాలంలో వారిద్దరికీ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్లు ఇచ్చి మంత్రులుగా కూడా చేర్చుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సొంత ప్రజలపై దాడులు చేసినందుకు కానుకగా ఇందిరా గాంధీ వారికి ఆ పదవులు ఇచ్చారని స్పష్టంగా తెలుస్తోంది” అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు అమిత్ మాలవ్య. అమిత్ మాలవ్య పోస్టుకు సచిన్ పైలట్ బదులిస్తూ.. “మీ దగ్గర తప్పుడు తేదీలు.. తప్పుడు సమాచారముంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమేనని.. కానీ అది తూర్పు పాకిస్తాన్ పైన అని.. అదికూడా 1971లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా బాంబులు వేశారని స్పష్టం చేశారు. మీరు చెప్పినట్టు 1966, మార్చి 5న మిజోరంపై కాదన్నారు. మా నాన్న 1966, అక్టోబరు 29న విధుల్లో చేరారు. జై హింద్.. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.” అని రాసి కింద తన తండ్రి రాజేష్ పైలట్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో జాయిన్ అయిన జాయినింగ్ డేటు ఉన్న సర్టిఫికేటును ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
.@amitmalviya – You have the wrong dates, wrong facts…
Yes, as an Indian Air Force pilot, my late father did drop bombs. But that was on erstwhile East Pakistan during the 1971 Indo-Pak war and not as you claim, on Mizoram on the 5th of March 1966.
He was commissioned into the… https://t.co/JfexDbczfk pic.twitter.com/Lpe1GL1NLB— Sachin Pilot (@SachinPilot) August 15, 2023
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?