Tribute to Bandi Sanjay on the occasion of Ale Narendra’s death: రాంజీగోండు చరిత్రను వెలుగులోకి తెస్తామని బీజేపీప రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ బండి సంజయ్ అన్నారు. అలే నరేంద్ర వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. కుహానా లౌకిక శక్తులకు సింహ స్వప్నం ఆలె నరేంద్ర అని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన నాయకుడు అని తెలిపారు. కుహానా లౌకిక శక్తులకు సింహ స్వప్నం ఆలె నరేంద్ర అని బండి సంజయ్ కొనియాడారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన నాయకుడు నరేంద్ర అని అభివర్ణించారు.
తెలంగాణ బద్ద వ్యతిరేకి ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీని వ్యతిరేకించిన నరేంద్ర కేసీఆర్ నీచ చరిత్రను ఎండగట్టిన విషయాన్ని గుర్తు చేశారు. నరేంద్ర స్పూర్తితో హిందువులను సంఘటితం చేస్తామన్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం రాంజీగోండు, కొమరం బీం వంటి నేతల జీవిత చరిత్రను సైతం పాఠ్యంశాల్లో చేర్చేందుకు క్రుషి చేస్తామన్నారు. ఈరోజు టైగర్ ఆలె నరేంద్ర వర్ధంతి సందర్భంగా బండి సంజయ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ సహా పలువురు రాష్ట్ర నాయకులు నరేంద్రకు నివాళులు అర్పించారు.
హిందూ టైగర్, ఎంఐఎం నాయకుల పాలిట సింహస్వప్నం, హైదరాబాద్ కా షేర్ టైగర్, తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన నాయకుడు ఆలె నరేంద్ర అన్నారు. చిన్నతనంలో జనసంఘ్ ద్వారా రాజకీయాల్లోకి చేరి ఫుల్ టైమర్ గా పనిచేసిన నాయకుడని తెలిపారు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి 18 నెలలపాటు జైలు జీవితాన్ని అనుభవించిన నేత అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పోలీసుల వలయాన్ని చేధించుకుని కరసేవలో పాల్గొన్న నాయకుడు నరేంద్ర అని తెలిపారు. హిందూ వ్యతిరేకులపై జీవితాంతం పోరాడిన యోధుడని, ఎంఐఎం అరాచకాలను ఎదుర్కొంటూ హైదరాబాద్ లో హిందువులను ఏకం చేస్తూ ఎంఐఎం నాయకులకు సింహస్వప్నంగా నిలిచిన నేత నరేంద్ర అని కొనియాడారు.
హైదరాబాద్ లో ఈరోజు హిందువులు ప్రశాంతంగా ఉన్నారంటే ఆనాడు నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి వంటి వారు చేసిన పోరాటాలే కారణం అని తెలిపారు. కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్ లో చేరి తెలంగాణ కోసం పోరాడిన నరేంద్ర చివరకు కేసీఆర్ నీచ చరిత్రను తెలుసుకుని బయటకు వచ్చారన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంతో మొదటి నుండి కేసీఆర్ చేసిన దోస్తీని ఎండగట్టారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నరేంద్ర ఏనాడూ నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టని నాయకుడని, చరిత్ర విస్మరించిన నాయకుడు, ఆదివాసీల ముద్దు బిడ్డ రాంజీ గోండు వర్ధంతి నేడు. సిపాయిల తిరుగుబాటుకు బీజం వేసిన వీరుడు అని పేర్కొన్నారు. బానిస బతుకులు వెళ్లదీస్తున్న గోండు గిరిజనులకు అండగా ఉంటూ సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని నిజాం సైనికులపై పోరాడిన యోధుడు రాంజీ గోండు అని తెలిపారు.
ఆదివాసీ గోండు జాతి ఆరాధ్య దైవం రాంజీ గోండు వర్ధంతి నేడు. గోండు జాతిని వెట్టి విముక్తి నుండి కాపాడేందుకు సొంతంగా సైన్యాన్ని తయారు చేసి నిజాం సైన్యాన్ని గడగడలాడించిన పోరాట యోధుడు. నిజాం కుట్రలకు బలై ఉరికొయ్యలను ముద్దాడిన వీరుడని పేర్కొన్నారు. బలగాలు కుట్ర చేసి రాంజీగోండుసహా వెయ్యి మంది సైన్యాన్ని బంధించి నిర్మల్ నడిబొడ్డున ఉన్న ఊడలమర్రి చెట్టుకు ఉరి తీశారన్నారు. నాటి చరిత్ర సజీవ సాక్షంగా నిలిచిన ఉడల మర్రి ఆనవాళ్లు లేకుండా చేశారు. చరిత్ర కారులు సైతం రాంజీగోండు పోరాటానికి చరిత్ర పుటల్లో సరైన స్థానం కల్పించకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కొమరం భీం, రాంజీ గోండు పోరాటాన్ని, త్యాగాల్ని భావితరాలకు అందించేందుకు, వారి చరిత్రను పాఠ్యంశాల్లో చేర్చేందుకు కృషి చేస్తామన్నారు.
Dog attacks: సెకనుకో దాడి.. అరగంటకో మరణం.. ఐసీఎంఆర్ వెల్లడి