ఈ సంవత్సరం జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది రానున్న లోకసభ సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ముఖ్య నేతలతో కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. గత 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపి ఓడిపోయిన సుమారు 160 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసుకోవడంపై చర్చిస్తున్నారు. బీజేపీ రూపొందించిన “లోకసభ ప్రవాస్” కార్యక్రమంతో సంబంధమున్న ముఖ్య నేతలందరూ ఈ మీటింగ్ కు హాజరయ్యారు.
Read Also: Shocking: ఆ సినిమా నుంచి రష్మిక మందన్న అవుట్.. కారణం అదేనా?
మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, మిజోరం రాష్ట్ర అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో బీజేపీ కార్యనిర్వాహక సభ్యులు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కర్నాటకలో ఓటమి తర్వాత ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవీడుచుకోకూడదని బీజేపీ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి, పూర్తి సామర్ధ్యంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. రానున్న సార్వత్రిక లోక్ సభ ఎన్నికలను ప్రభావితం చేయాలన్నదే బీజేపీ పార్టీ ప్రధాన వ్యూహాం.
Read Also: Exclusive: బిగ్ బాస్ హోస్ట్ ఎవరో తెలిసిపోయింది.. ఇదుగో సాక్ష్యం
రానున్న లోకసభ సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కీలకమని కమలం పార్టీ భావిస్తుంది. అయితే.. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కమలం పార్టీ నేతలు పర్యటిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది.