Jithender Reddy: సంచలనంగా మారిన మాజీ ఎంపీ ట్వీట్.. టి.బీజేపీకి ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jithender Reddy: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గత కొన్ని రోజులుగా ఏదో జరిగిపోతుంది అనే ప్రచారం సాగుతూ వస్తుంది.. దానికి అనుగుణంగా.. రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు అంటీముట్టనట్టు ఉండడం.. రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లడం.. బీజేపీ పెద్దలను కలవడం.. ఆ తర్వాత వారు మాట్లాడిన తీరు చూస్తే.. అదంతా నిజమే అనిపించేలా పరిస్థితులు ఉన్నాయి.. అయితే, తాజాగా, మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి సోష్‌ల మీడియా వేదిక చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది.. నిజంగా తెలంగాణ బీజేపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అనేలా చేసింది..
Read Also: Etela Rajender: ఈటల రాజేందర్ తో మేడ్చల్ డీసీపీ సందీప్ రావు భేటీ..
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ఇక, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ఆ వివాదాస్పద ట్వీట్ విషయానికి వెళ్తే.. గేదెను ట్రాలీ ఎక్కిస్తున్న ఓ వీడియోను షేర్ చేశారు.. గేదెను ట్రాలీకి కట్టి.. దానిని వెనకనుంచి తన్నగానే వెంటనీ ట్రాలీలోకి ఎక్కేసింది.. ఇక, ఇలాంటి ట్రీట్‌మెంట్ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అవసరం అంటూ ఆయన కామెంట్ రాసుకొచ్చారు.. అంతేకాదు.. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్, తెలంగాణ బీజేపీని ట్యాగ్ చేసి ఆ ట్వీట్ చేశారు.. మొత్తంగా ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తన అసంతృప్తిని జితేందర్‌రెడ్డి ఇలా బయటపెట్టారనే చర్చ సాగుతోంది.. కాగా, రాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న కొందరు నేతలు గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్నారని.. మరికొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. బీజేపీ అగ్రనాయకత్వం.. తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని మార్చేందుకు కసరత్తు కూడా చేస్తుందనే చర్చ కూడా నడుస్తోంది.. ఈ సమయంలో.. జితేందర్‌రెడ్డి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మరి, ఆ పార్టీ నేతలు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో చూడాలి.
అయితే, కొద్ది సేపటి క్రితం మరో ట్వీట్ చేశారు జింతేదర్ రడ్డి.. “కేసీఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే… బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార.. బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి” అంటూ ఘాటుగా రాసుకొచ్చారు.
This treatment is what's required for Bjp Telangana leadership.@blsanthosh @BJP4India @AmitShah @sunilbansalbjp @BJP4Telangana pic.twitter.com/MMeUx7fb4Q
— AP Jithender Reddy (@apjithender) June 29, 2023
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!