ఏపీ రాజకీయం ఢిల్లీకి మారింది. బీజేపీ పెద్దలతో రాష్ట్ర అధినేతల వరుస భేటీలు ఆసక్తిరేపుతున్నాయి. నిన్న కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై చర్చించారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నమే ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. కాగా.. చంద్రబాబు వెళ్లిన మరుసటి రోజే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. కాగా.. నిన్న బీజేపీ పెద్దలతో జరిగిన చంద్రబాబు భేటీలో జనసేన, బీజేపీతో…
బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి.
కరీంనగర్ బీజేపీ లో విభేదాలు ముదిరుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఉమ్మడి జిల్లా నేతలు నగరంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ కు పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని నేతలు హాజరు అయ్యారు.
గతంలో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం సబబేనని తెలిపింది. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులు స్పందించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు. "ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో.. జమ్మూ కాశ్మీర్‌ను దేశంలోని ప్రధాన…
ఎన్నికలకు మరో మూడు రోజులు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రచారం దూకుడు పెంచారు. ఏకంగా హైకమాండ్ నేతలు తెలంగాణలో పర్యటిస్తూ.. అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కవరయ్యేలా పర్యటన షెడ్యూల్ ను రూపొందించుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు.
నన్ను తిట్టే హక్కు బీజేపీ నాయకులకు లేదు.. కేసీఆర్ ఇచ్చే డబ్బు కోసం పని చేసే వ్యక్తిని కాదు.. మిలాగా లొంగిపోను.. అద్వానీ నాకు గురువు.. ఆయన మాకు సంస్కారం నేర్పారు.. మీలాగా అసభ్యకరంగా మాట్లాడను.. నాపై మాట్లాడిన వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోండి అంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన కొందరు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. గత పదేళ్ళలో మసిగుండ్లపల్లి గ్రామం చాలా మారిందని.. రోడ్డు, డ్రైనేజీలతో పాటు గ్రామం అభివృద్ధి చెందిందని పార్టీ మారిన నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పథకాలకు అభివృద్ధికి ఆకర్షితులయ్యే పార్టీలో చేరుతున్నట్లు మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
KTR: బస్సులు పెడుతాం.. భోజన సౌకర్యం కల్పిస్తాం.. ఎక్కడికైనా కాంగ్రెస్, బీజేపీ నాయకులు వెళ్ళి కరెంట్ వైర్లు పట్టుకోండి.. షాక్ కొట్టి పోతే దరిద్రం పోతుందని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.