పార్టీలో ఉండేవారు ఎవరో.. వెళ్లిపోయేవారు ఎవరో తెలియడం లేదు. ఎందుకైనా మంచిదని ఆరా తీస్తుంటే లేనిపోని సమస్యలు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఈ సంకట స్థితినే ఎదుర్కొంటోంది. వేరేపార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి తాజా పరిణామాలు ఇబ్బందిగా మారాయట. పార్టీకి ఎవరో ఒకరు గుడ్‌బై చెప్పి ప్రతిసారీ పాతివ్రత్యం నిరూపించుకోవాలా అని ప్రశ్నిస్తున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న కమలనాథులు! తెలంగాణ బీజేపీలో గత రెండు మూడేళ్లుగా చేరికలు…
హామీలదేముంది ఫ్రీగా ఇచ్చేయొచ్చు. నెరవేర్చటం మాత్రం అంత ఈజీ కాదు. ఇది సామాన్యులకే కాదు.. నేతలకు కూడా అనుభవమే అవుతోంది. ఈ విషయం ఇప్పుడు కమలంలో ఉన్న మాజీ టిడిపి నేతలకు మరింత ఎక్కువగా తెలుసట. అందుకే… కమలం పార్టీ తమకు పెద్దగా వర్కవుట్ కాలేదని భావిస్తున్నారట. కమలం పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారా? ముఖ్యంగా ఇతర పార్టీ ల నుండి వచ్చిన నేతలు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారా? ఇదే టాక్ ఇప్పుడు ఆ పార్టీలో…
తెలంగాణ బీజేపీ పార్టీ పాదయాత్రతో ప్రజాక్షేత్రంలో ఉండాలని భావిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదివరకే ప్రకటించారు. కాగా నేడు మరోసారి బండి సంజయ్ అధ్యక్షతన ఈ విషయమై సమావేశం జరిగింది. ఆగస్టు 9 నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర, హుజూరాబాద్ ఎన్నికలు ప్రధాన అంశాలుగా చర్చించారు. పాదయాత్ర లక్ష్యాలు, ఉద్దేశాలను బండి సంజయ్ వివరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక, నియంత, గడీల పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబపాలనలో…
రెండు వరస ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయారు. రాజకీయ భవిష్యత్ కోసం.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పంచన చేరారు. అక్కడా కుదురుకోలేని పరిస్థితి. ఇంతలో పీసీసీ చీఫ్‌గా రేవంత్ రావడంతో ఘర్‌వాపసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే ఆ జిల్లా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు రేవంత్‌తో టచ్‌లో ఉన్నారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డికి కీలక…
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గత కొంత కాలంగా కృష్ణా నది జలాల విషయంలో మాటలు, లేఖల యుద్ధం నడుస్తోంది.. ఈ తరుణంలో.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జూమ్ మీటింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. ఈ సమావేశంలో కృష్ణా నీటి పంపకాలపై ప్రధానంగా చర్చించనున్నారు.. ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలు, వివాదాలు, ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వర ప్రాజెక్ట్‌పై తదితర అంశాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇక, నీటి పంపకాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోన్న సమయంలో.. చర్చలకు సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ.. ఎల్లుండి కర్నూలులో రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాయలసీమ పదాధికారులు, ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రాయలసీల ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాలువ, గుండేగుల, వేదవతి ప్రాజెక్టులపై బీజేపీ నేతలు చర్చించనున్నారు.. ప్రాజెక్టుల అంశంలో భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా…
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితుల మీద దాడులు, లాకప్ డెత్ లు పెరిగాయి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పోలీస్ ల దెబ్బలకు తట్టుకోలేక మరియమ్మ మరణించింది. దీని పై మేము గవర్నర్ ను కలిసి వస్తుంటే సీఎం కార్యాలయం నుంచి మాకు ఫోన్ వచ్చింది. దళిత ఎంపవర్ మెంట్ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. దళితుల మీద దాడులు చేస్తూ సమావేశానికి రమ్మంటే ఎందుకు రావాలని నిలదీశాను.. దాంతో సీఎం మమ్మల్ని కలవడానికి అవకాశం…
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.. ఇప్పటికే కేంద్ర నాయకత్వాన్ని కలిసిన ఆయన.. తనకున్న అనుమానాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈటల.. బీజేపీలోకి టచ్‌లోకి వచ్చాడన్న వార్తలు వచ్చినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరో బీజేపీ నేత పెద్దిరెడ్డి.. అసలు ఈటల వస్తే.. పార్టీలో ప్రకంపణలు తప్పవని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.. ఇక, ఆయనను అప్పడి నుంచి బుజ్జగిస్తూనే ఉంది రాష్ట్ర పార్టీ.. ఇప్పటికే…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. మృతుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. ఈ సమయంలో కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు గోమూత్రం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల వైద్య సేవల కోసం కేంద్రం ఏదైనా కార్యనిర్వహక దళాన్ని ఏర్పాటు చేసిందా.. అని ట్విట్టర్ ద్వారా జైవీర్ షెర్గిల్ ప్రశ్నించారు. డార్క్…
తెలంగాణ ప్రభుత్వం ,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన విమర్శలు చేసే నాయకులు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గతంలో పాలన ఎలా ఉండేదో గుర్తుకు ఎరిగి మాట్లాడితే మంచిదన్న ఆయన కేంద్రం నిధులు ఇస్తే పేర్లు మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటుంది అని విమర్శలు చేస్తున్నారు. వాస్తవం తెలుసుకొని మాట్లాడితే ప్రజలు ఆ నాయకులకు గౌరవం దక్కుతుందని అన్నారు. కేంద్ర పథకాలు మేము కాపీ కొట్టడం లేదు .మన రాష్ట్ర…