కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలి హత్యాచారం తర్వాత నెమ్మదిగా ఆందోళనలు సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా అల్లరిమూకలు.. ఆస్పత్రిలోకి ప్రవేశించి ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నించడంతో తాజాగా ఈ ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఓ వైపు కేంద్రం కసరత్తు మొదలు పెడుతూనే మరోవైపు రకరకాల వ్యూహాలకు సంబంధించి రౌండ్ సమావేశాలు కూడా సాగుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంట్లో ఆదివారం భారీ సమావేశం జరిగింది.
రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ అగ్రనాయకులు, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్, అమిత్ షా, జేపీ నడ్డాలు రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో అగ్రనాయకులు పాల్లొంటారని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారన్నారు.
సోమవారం ఎన్నికల సంఘాన్ని పశ్చిమ బెంగాలు బీజేపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా.. టీఎంసీ నేత పీయూష్ పాండాపై ఫిర్యాదు చేశారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రచారం చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్‌ను బీజేపీ కోరింది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన సమయంలో తన కులాన్ని ఉద్దేశించి పాండా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో.. రోజు ఢిల్లీలో ఈసీని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.…
త్వరలోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తు్న్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి.