ఎంబీసీ కులాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఎం మత్స్య సంపద పేరుతో అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను కాంగ్రెస్ హయాంలో కేవలం ఎస్సిలకే పరిమితం చేసిందన్నారు. అంతేకాకుండా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వెంచర్ క్యాపిటల్ ఫండ్ ను బీసీలకు కూడా కల్పించిందన్నారు. తెలంగాణలో బీసీ రుణాలు ఆటకెక్కాయి…
తెలంగాణలో ఒక సంఘటన అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆత్మహత్య చేసుకుని నెల రోజులు అయినప్పటికి ఇంకా సాయి మృతి అధికార పార్టీని వదలిపెట్టడం లేదు. సాక్షాత్తు బీజేపీ జాతీయ నాయకుల వద్ద నుంచి రాష్ర్ట నాయకుల వరకు గణేష్ ఆత్మహత్య వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అటు అమిత్ షా వద్ద నుంచి ఇటు పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు వరకు సాయి గణేష్ ఆత్మహత్య…
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చేరిగారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తాటాకు చప్పుళ్ళకు బీజేపీ భయపడదని కిషన్ రెడ్డి అన్నారు. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని ఆయన విమర్శలు గుప్పించారు. దళితులకు వెన్నుపోటు పొడవటం, సచివాలయానికి రాకుండా పాలన చేయటమే కేసీఆర్ గుణాత్మకమైన మార్పు అన్నారు. కల్వకుంట్ల కుటుంబం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్లు నాయకులు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ నేడు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీజేపీ నేత రవీంద్ర నాయక్ కౌంటర్ వేశారు. రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అని కేసీఆర్ కుటుంబాన్ని మాత్రం బంగారం చేసుకున్నాడని ఆయన విమర్శించారు. అంతేకాకుండాఇప్పుడు బంగారు భారత దేశం అంటున్నాడు కేసీఆర్.. సెంటిమెంటు రగల్చేందుకు ప్రయత్నం…
హిందూ దేవాలయాల షాపింగ్ కాంప్లెక్సులను ఇతర మతస్థులకు కూడా కేటాయించవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరం అన్నారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. బీజేపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా వున్న ఆయన ఈ అంశంపై తన అభిప్రాయం వెలిబుచ్చారు. పిటిషనర్ గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ సమస్యను సుప్రీంకోర్టు ముందు సరైన రీతిలో ఉంచినట్టు లేరు. ఇక్కడ అంశం అమ్మకానికి సంబంధించింది కాదు. హిందువులు హుండీలో వేసిన డబ్బులతో కట్టిన షాపింగ్ కాంప్లెక్సులను…
సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న బీజేపీ జిల్లా శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి. అక్కడ ఆయన మాట్లాడుతూ… సిద్దిపేట ప్రజల్లో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంది,దుబ్బాక, హుజురాబాద్ లో గెలిచినట్టు సిద్దిపేట లో గెలిచేందుకు వ్యూహ రచన చేస్తున్నాం అన్నారు. ఇక రాష్ట్రంలో అవినీతి చెత్త కుప్పలా తయారైంది,రాష్ట్రం ఓకె కుటుంబం గుప్పిట్లో బంది అయ్యింది. బీజేపీ వైపు చాలా మంది ఎదురు చూస్తున్నారు,వేములవాడలో ఎన్నికలు వస్తే…
గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు నిన్న నల్గొండ జిల్లా బండి సంజయ్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన కాన్వాయ్ పై దాడి పై గవర్నర్ కి ఫిర్యాదు చేసారు. అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ… హుజురాబాద్ ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు అని అన్నారు. ఇక సీఎం ఆదేశాల మేరకే బండి సంజయ్ పై దాడి జరిగింది. తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణీస్తున్నాయి. అందుకే గవర్నర్ దృష్టి కి తీసుకెళ్ళాం అని తెలిపారు.…
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని బీజేపీ మహిళా నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాజా పరిస్థితిని గమనిస్తే…. కేంద్రం వద్ద బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) నిల్వలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి… వాటిని వినియోగించేందుకు కొన్నేళ్లు పడుతుంది కనుక… 2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుంచి 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుంటుంది. మిగిలిన బియ్యం రా రైస్ (పచ్చి…
హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత కేసీఆర్ మతితప్పి మాట్లాడుతున్నారు అని బీజేపీ నేత రవీంద్ర నాయక్ అన్నారు. కేసీఆర్ ను ఓటమిని తట్టుకోలేడు నాకు తెలుసు. కేసీఆర్ గొప్పలు నిజమైతే హుజురాబాద్ లో ఓటుకు 20వేలు ఎందుకు ఇచ్చారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నీకు, నీ కొడుకుకు,బిడ్డకు ఫామ్ హౌస్ లు ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలుసు. బండి సంజయ్ ని ఆరు ముక్కలు చేసే దమ్ముందా కేసీఆర్…