bjp leader bernad en marak.
దేశంలో ఇప్పటికే ఎక్కడపడితే అక్కడ స్రీలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్న ఘటనలు రోజూ చూస్తునే ఉన్నాం. అయితే.. ఓ ఉన్నతమైన స్థానంలో ఉన్న బీజేపీ నేతకు చెందిన ఫాంహౌస్‌లో వ్యభిచారం కూపం బయటపడటం శోచనీయం. వివరాల్లోకి వెళితే.. మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్ మారక్‌కు చెందిన రింపు బగాన్ ఫాం హౌస్‌లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఆ ఫాం హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులు ఆరుగురు బాలికలను రక్షించాడమే కాకుండా.. 73 మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా.. వెస్ట్ గరో హిల్స్ సూపరింటెండెంట్ వివేకానంద్ సింగ్ మాట్లాడుతూ.. నలుగురు బాలురు, ఇద్దరు బాలికలను రక్షించినట్టు ఆయన వెల్లడించా. బెర్నార్డ్, ఆయన సహచరులు వ్యభిచార గృహం నడుపుతున్న రింపు బగాన్‌లోని అపరిశుభ్రమైన గదులలో వీరిని బంధించినట్టు గుర్తించామని, రక్షించిన వారిని జిల్లా బాలల సంరక్షణ అధికారి కి అప్పగించినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే.. బెర్నార్డ్ ఫాంహౌస్‌పై దాడిచేసిన పోలీసులు 27 వాహనాలు, 8 బైక్‌లు, 400 సీసాల మద్యం, 500 కండోములు, విల్లంబులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు.
స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను బట్టి అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు అర్థమవుతోందని, ఫాం హౌస్‌లో చిన్నచిన్న గదులు 30 ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, 73 మందిని అరెస్ట్ చేశామని, మైనర్‌పై ఒక వారంలో అనేకసార్లు అత్యాచారం జరిగినట్టు నిర్ధారించినట్టు ఎస్పీ వివేకానంద్ తెలిపారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తనను, తన స్నేహితుడిని నిందితులు రింపు బగన్‌కు తీసుకెళ్లారని బాధితురాలు కోర్టుకు తెలిపింది. నిందితులు అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకుని తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది బాధిత బాలిక. ఇదిలా ఉంటే.. తనపై వచ్చిన ఆరోపణలను బెర్నార్డ్ కొట్టిపడేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. సీఎం కొన్రాడ్ సంగ్మా తనపై కక్ష కట్టారని, ఆయన ఆదేశాలతోనే పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా దాడులు చేశారని ఆరోపించారు బెర్నార్డ్. మైనర్లు అయిన విద్యార్థులను తన ఖర్చుతో చదివిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.