హిందూ దేవాలయాల షాపింగ్ కాంప్లెక్సులను ఇతర మతస్థులకు కూడా కేటాయించవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరం అన్నారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. బీజేపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా వున్న ఆయన ఈ అంశంపై తన అభిప్రాయం వెలిబుచ్చారు. పిటిషనర్ గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ సమస్యను సుప్రీంకోర్టు ముందు సరైన రీతిలో ఉంచినట్టు లేరు.
ఇక్కడ అంశం అమ్మకానికి సంబంధించింది కాదు. హిందువులు హుండీలో వేసిన డబ్బులతో కట్టిన షాపింగ్ కాంప్లెక్సులను అద్దెకు ఇచ్చేటప్పుడు ఇతర మతస్థులకు ఇవ్వడం సరి కాకపోవచ్చు. మరి ఇదే విధానం వక్ఫ్ బోర్డు, చర్చిల ఆస్తుల విషయంలో కూడా వర్తిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. దీనిమీద సుప్రీం కోర్టు తీర్పులో స్పష్టత ఉన్నట్టు లేదు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే రివ్యూ పిటిషన్ వేసి ఈ అంశంలో స్పష్టత తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలని కోరుతున్నా అన్నారు ఐవైఆర్ కృష్ణారావు. ఈ అంశంపై ఐవైఆర్ కృష్ణారావు ఒక ప్రకటన విడుదల చేశారు.