సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న బీజేపీ జిల్లా శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి. అక్కడ ఆయన మాట్లాడుతూ… సిద్దిపేట ప్రజల్లో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంది,దుబ్బాక, హుజురాబాద్ లో గెలిచినట్టు సిద్దిపేట లో గెలిచేందుకు వ్యూహ రచన చేస్తున్నాం అన్నారు. ఇక రాష్ట్రంలో అవినీతి చెత్త కుప్పలా తయారైంది,రాష్ట్రం ఓకె కుటుంబం గుప్పిట్లో బంది అయ్యింది. బీజేపీ వైపు చాలా మంది ఎదురు చూస్తున్నారు,వేములవాడలో ఎన్నికలు వస్తే తప్పకుండా గెలుస్తాం అని తెలిపారు. అలాగే కేసీఆర్ స్వార్థంతో లేని సమస్యను సృష్టించి రైతుల్ని ఇబ్బంది పాలు చేస్తున్నాడు అని పేర్కొన్నారు.