సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా పార్టీల నుంచి నేతలు ఇటు అటు జంప్ అవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడడం.. ఇంకోవైపు టికెట్లు లభించకపోవడంతో నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారిపోతున్నారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత అశోక్ చవాన్‌కు (Ashok Chavan) రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు ముప్పు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న నివేదిక ప్రకారం
తెలంగాణలో 30 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది గుండు సున్నా అని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆరు గ్యారంటీలపై వారికే గ్యారంటీ లేదు అని విమర్శలు గుప్పించారు.
మధ్యప్రదేశ్‌లోని గుణాలో బుధవారం జరిగిన ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సులో 'ఫిట్‌నెస్ సర్టిఫికేట్' లేదని గుర్తించారు. ఇక, ఆ బస్సు బీజేపీ నేతకు చెందినదని తెలిసింది.
మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సమయంలో తన పదవీకాలంలో రూ. 40,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా.. ఏ నాయకుడు ఏ విధంగా ఎంత డబ్బు సంపాదించాడో తనకు తెలుసన్నారు. ప్రభుత్వం కేవలం రూ.45 విలువ చేసే మాస్క్‌ను రూ.485కి కొనుగోలు చేసిందని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ల కోసం 10,000 పడకలు అవసరమని యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం తెలిపింది. పడకలను అద్దెకు…
కర్నాటకలోని బెళగావి జయనగర్‌లో బీజేపీ నేత పృథ్వీ సింగ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ చన్నరాజ్ హత్తిహోళి కత్తితో దాడి చేశారు. ఆయన నివాసానికి సమీపంలోనే ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పృథ్వీ సింగ్ చేతులు, వీపుపై గాయాలయ్యాయి. దీంతో అతన్ని బెలగావిలోని కేఎల్‌ఈ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తమిళనాడులో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నటి, బీజేపీ నాయకురాలు గౌతమి తాడిమళ్ల బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని గౌతమి తాడిమళ్ల లేఖ ద్వారా తెలియజేశారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం పట్టణంలో వివిధ పోలింగ్ బూతులను రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పరిశీలించారు.
మహిళల భద్రతపై బీజేపీ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రత కోసం అవసరమైతే పోలీసులు ఎన్కౌంటర్లను ఆశ్రయించాలని సువేందు అధికారి బుధవారం అన్నారు.