గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు నిన్న నల్గొండ జిల్లా బండి సంజయ్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన కాన్వాయ్ పై దాడి పై గవర్నర్ కి ఫిర్యాదు చేసారు. అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ… హుజురాబాద్ ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు అని అన్నారు. ఇక సీఎం ఆదేశాల మేరకే బండి సంజయ్ పై దాడి జరిగింది. తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణీస్తున్నాయి. అందుకే గవర్నర్ దృష్టి కి తీసుకెళ్ళాం అని తెలిపారు. దాడులు చేయడం కాదు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. బెంగాల్ తరహా రాజకీయాలు ఇక్కడ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. భయబ్రాంతులకు గురి చేస్తే ఎవరు భయపడరు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వానకాలం ధాన్యం కొనాలి అని డిమాండ్ చేసారు.