తెలంగాణలో ఒక సంఘటన అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆత్మహత్య చేసుకుని నెల రోజులు అయినప్పటికి ఇంకా సాయి మృతి అధికార పార్టీని వదలిపెట్టడం లేదు. సాక్షాత్తు బీజేపీ జాతీయ నాయకుల వద్ద నుంచి రాష్ర్ట నాయకుల వరకు గణేష్ ఆత్మహత్య వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అటు అమిత్ షా వద్ద నుంచి ఇటు పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు వరకు సాయి గణేష్ ఆత్మహత్య ను అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా చేస్తున్నారు. నెల రోజుల తరువాత కూడా సాయి ఆత్మహత్య పై అధికార పార్టీని, పోలీసు యంత్రాంగాన్ని దుమ్ము దులుపుతున్నారు.
బీజేపీ నేత సాయి ఆత్మహత్య వ్యవహారం మరుగున పడి పోకుండా రాజకీయాలు నడుస్తున్నాయని అనిపిస్తోంది. సాయి ఆత్మహత్య వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదని సాక్షాత్తు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నోటి నుంచి రావడం అంటే.. ఆ వ్యవహారాన్ని సాదా సీదాగా కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టేటట్లు లేదని స్పష్టం అవుతుంది. సాయి ఆత్మహత్య అధికార పార్టికి, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న , ఇచ్చిన పోలీసు అధికారులను ఇరుకున పెట్టనున్నదా అంటే అవుననే అంటున్నారు.
గత నెలలో ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ యువ నేత, బీజేపీ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు సాయి గణేష్ ఆత్మహత్య బాధ్యులను వదిలిపెట్టేది లేదని సాక్షాత్తు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేయడం రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. గత నెల 13 వ తేదీన సాయి గణేష్ పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేయగా చికిత్స పొందుతూ 15 వ తేదీన చనిపోయాడు. సాయి ఆత్మహత్య జరిగి ఇప్పటికి నెల రోజులు అయినప్పటికి ఆత్మహత్య ప్రకంపనలు మాత్రం వదలడం లేదంటున్నారు. ఆత్మహత్య ఘటన రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. పోలీసుల వేధింపులకు ఇది పరాకాష్ర్ట అయితే.. ఆ పోలీసులు వేధింపులకు పాల్పడడానికి అధికార పార్టీ కారణమని చర్చ సాగుతుంది.
గత నెలలో మంత్రి కేటీఆర్ నగరానికి వస్తున్నారని సాయిని పోలీసులు రమ్మని కోరడంతో పాటు పలు కేసుల్లో తనను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదో చిన్నచిన్న కేసులు… అవి కూడా రాజకీయ పరమైన కేసులు ఉన్నప్పటికి వాటిని ఆధారంగా చేసుకుని ఖమ్మం వన్ టౌన్ పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేసి త్రీ టౌన్ కు బదిలీ చేశారు. దీంతో ఇప్పుడు రెండు పోలీసు స్టేషన్ లకు చెందిన వారు ఈకేసులో సమాధానం చెప్పుకోవలసి వస్తోంది. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివాన మాదిరిగా మారుతోంది. సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారాన్ని బిజెపి కేంద్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఖమ్మం లో జరిగిన ఓ చిన్న ఘటనను బిజెపి జాతీయ నాయకుడు, హోం మంత్రి అమిత్ షా పలు మార్లు స్పందించడంతో ఆకేసు ను ఎంత సీరియస్ గా ఆ పార్టీ తీసుకుందో అర్ధం అవుతుంది.
మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశాల వల్లనే ఖమ్మం నగరంలో బిజెపి క్యాడర్ పై కేసులు పెడుతున్నారని ఇటు కాంగ్రెస్ క్యాడర్ పై కూడ పలు కేసులు పెడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇవే ఆరోపణలు కాంగ్రెస్ క్యాడర్ పై ఉన్నాయి. కాంగ్రెస్ క్యాడర్ పై కూడ పోలీసులు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డట్లుగా ఆరోపనలు వచ్చాయి. దీంతో సాయి గణేష్ ఆత్మహత్య ఓ స్థాయిలో వివాదంగా మారింది. ఒక్క సంచలనంగా మారింది. అధికార పార్టీకి చుట్టు ముట్టింది. మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు, ఖమ్మం నగర పోలీసులపై ఈకేసు చుట్టుకుంది. ఖమ్మం జిల్లా పోలీసులపై నమ్మకం లేదని దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో కేసు ఇప్పుడు హైకోర్టుకు వెళ్లింది.
అయితే ఈకేసును మాత్రం బీజేపీ వదిలిపెట్టడం లేదు. సాయి గణేష్ ఆత్మహత్యను రాజకీయంగా కమల దళం ఉపయోగించుకుంటుంది. ఒక్కవైపు ఖమ్మంలో ప్రత్యర్ధి పార్టీల మీద కేసుల మీద కేసులు పెడుతుండగా సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం పరాకాష్టకు చేరింది. దీంతో ఇది రాష్ర్టంలో ఒక్క చర్చనీయాంశం అయిన అంశంగా మారింది. ఇకపోతే సాయి ఆత్మహత్య చేసుకున్న తరువాత బీజేపీ దీనిని పెద్ద అస్ర్తంగానే మలచుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సాయి అమ్మమ్మకు ఫోన్ చేసి మీకు అండగా ఉంటామని చెప్పారు. ఆ తరువాత ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం డిల్లీ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా సాయి సంస్మరణ సభ లో మాట్లాడారు.అంతే కాకుండా తాజాగా హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరిగిన బిజెపి బహిరంగ సభ లో సైతం సాయి గణేష్ ఆత్మహత్య ఘటనపై మళ్లీ అమిత్ షా స్పందించారు. పార్టీలో కీలకంగా వున్న అమిత్ షా పదే పదే సాయి ఆత్మహత్య గురించి, పోలీసుల వేధింపుల గురించి మాట్లాడడం అంతే అంత తేలికగా ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టరని అర్ధం అవుతుంది.
మరోవైపున బండి సంజయ్ కూడా సాయిని తన ప్రియమైన శిష్యుడిగా భావిస్తున్నారు. సాయి ఆత్మహత్యయత్నం వద్ద నుంచి, చనిపోయిన తరువాత కూడా పదే పదే సాయి కుటుంబం గురించి, అదే విధంగా ఆత్మహత్య ఘటన గురించి ఆరా తీస్తు వచ్చారు. బండి పాదయాత్ర ముగియగానే ఖమ్మం కు చేరుకుని సాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మీకు అండగా ఉంటామని చెబుతున్నారు. సాయి ఆత్మహత్యకు బాధ్యులైన వారిని వదిలిపెట్టమని చెబుతూ వస్తున్నారు. మంత్రి, పోలీసు అధికారులను వదిలేది లేదని అంటున్నారు. అంటే సాయి ఆత్మహత్య వ్యవహారం ఖమ్మం పోలీసులను మంత్రి అజయ్ కుమార్ ను వదిలిపెట్టేటట్లు లేదని స్పష్టం అవుతుంది.
అయితే వచ్చే నెలలో ఈ కేసు మళ్లీ హైకోర్టు వద్దకు రానుంది. హైకోర్టు సీబీఐ విచారణ కు ఆదేశిస్తారా.. ఆదేశిస్తే ఏమి జరుగుతుందని కూడా చర్చ సాగుతుంది. సీబీఐ ఈ కేసును టేకప్ చేస్తే మాత్రం అధికార పార్టీ నాయకులకు, పోలీసులకు ఇక్కట్లు తప్పవని అంటున్నారు. ప్రధానంగా సాయి చనిపోవడానికి ముందు ఆసుపత్రి బెడ్ మీద ఉండి మీడియాకు తాను చనిపోవడానికి కారణాలను వెల్లడించారు. అయితే స్పృహలోనే ఉన్నప్పటికి ఖమ్మం ఆసుపత్రిలో పదహారు గంటల పాటు పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకోలేదు. అంటే వారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో.. అదేవిధంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారో అన్నది ఇది స్పష్టంగా కనిపిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇదే విషయాన్ని సీబీఐకి కూడా వివరించే అవకాశాలు ఉన్నాయి. ఈకేసు మాత్రం అధికార పార్టీని, అదే విధంగా ఖమ్మం పోలీసులను వదిలేటట్లుగా లేదని తెలుస్తోంది.
Amit Shah : దళితులకు 3 ఎకరాలు అన్నారు.. 3 అంగుళాల కూడా ఇవ్వలేదు