టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఎందుకు చేరానో వివరించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు రోడ్లమీద, మీడియాలో కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ వీక్ అయిపోయింది. కాంగ్రెస్ వల్ల ఒరిగేదేం లేదు. కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం లేదు. కాంగ్రెస్ కేసీఆర్ ని కొట్టలేదు. కాంగ్రెస్ ని గెలిపిస్తే వారు టీఆర్ఎస్ లోకి దూకుతారని జనం నమ్మడం లేదు. కేసీఆర్ ని ఓడించడానికే బీజేపీలో చేరా. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ని ఎన్నుకోవడానికి రెండున్నరేళ్ళు పట్టింది. రేవంత్ రెడ్డి కోసం నేను లాబీయింగ్ చేశానన్నారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలు ప్రస్తావించారు. రాజకీయాల్లోకి వచ్చిననాటినుంచి చోటుచేసుకున్న పరిణామాలను ఆసక్తికరంగా వివరించారు మాజీ ఎంపీ , బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
CS Somesh Kumar : తెలంగాణలో స్వాతంత్ర భారత వజ్రోత్సవాలపై సమీక్ష
ఎనిమిదేళ్ళ క్రితం రాజకీయాల్లోకి రావాలని నావెంటపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్ కు ఆదరణ లేదు. నేను చాలా కష్టపడి చేవెళ్ళలో పోటీచేయాల్సి వచ్చింది. తెలంగాణకు పోరాడిన వారు బయట వున్నారు. దరిద్రులు పార్టీలో వున్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో టీఆర్ఎస్ ఎక్కువకాలం వుండాలని భావించా. కానీ టీఆర్ఎస్ వల్ల ఏం కాలేదు. తెలంగాణకు పుట్టిన పార్టీ కాదు. కుటుంబం కోసం పుట్టింది. గులాబీ జెండా మనది అంటే పార్టీ నేతలు పొంగిపోవాలి. ఈటల గులాబీ జెండా మనది అంటే ఆయన వెంట పడ్డారు. 2014లో అర్థం కాలేదు. 2017 లో ఆత్మపరిశీలన చేశా. బీజేపీలో నేను చాలా కంఫర్ట్ గా వున్నా. టీఆర్ఎస్ లో తిరగాలంటే పెట్రోల్,విస్కీ పోయాలి. కానీ బీజేపీలో అలాలేదు. ఏ పార్టీలో అయినా డెమెక్రసీ వుండాలంటే గ్రూప్ లు వుంటాయి. అలా వుండాలి. పార్టీల్లో వుండే మంచిదే. టీఆర్ఎస్ లో డిక్టేటర్ షిప్ వుంది. బీజేపీలో డిసిప్లైన్ వుందన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీలో నాకు శత్రువులు లేరు. అలాగే బీజేపీ, టీఆర్ఎస్ లో లేరు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలని భావిస్తున్నారు. ఆయనతో నాకు పరిచయం లేదు. రాజగోపాల్ రెడ్డి చెబుతున్నది వాస్తవం. గడ్డి పచ్చగా వుందంటే.. అది వాస్తవం. నేను కూడా అదే చెబుతున్నా. ఆకాశం నీలంగా వుందంటే.. నేను కూడా అదే చెబుతున్నా. కాంగ్రెస్ లో జీ23 వుంది. నిజానికి అది జీ 66. కాంగ్రెస్ బలహీనం అయింది. ఇతర పార్టీలలో వారు బీజేపీతో టచ్ లో వున్నారు.
కొంతమంది టీఆర్ఎస్ నేతలు ఈటలతో టచ్ లో వున్నారు. బీజేపీకి బలం వుంది. కేసీఆర్ నియోజకవర్గంలో ఈటల పోరాడతారు. కేసీఆర్ గజ్వేల్ లో వుంటారా లేదా అనేది ఆయనే డిసైడ్ చేసుకోవాలి. టీఆర్ఎస్ నేతలకు భయంగా వుంది. ఈటల అంటే భయం ఉంది. ఏక్ నాథ్ షిండేలు తెలంగాణలో వున్నారని కేసీఆర్ అంటున్నారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. మేం గెలవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూంలు, మూడు ఎకరాల భూమి.. ఇలా 1 టు 100 లెక్కపెడుతున్నారు. రాష్ట్రం అప్పుల పాలయింది.. క్లౌబ్ బరస్ట్ అంటూ కేసీఆర్ అభాసుపాలయ్యారు. కాళేశ్వరం గురించి చెప్పా. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ ని.. కొండ పోచమ్మని ఎందుకు నింపలేకపోతున్నారు. ఈ పథకం వల్ల వందల కోట్ల కరెంట్ బిల్లు వస్తుందన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
ఎనిమిదేళ్ళలో మూడుపార్టీలు మారారు విశ్వేశ్వర్ రెడ్డి. మేం చదువుతోనే కోట్లు సంపాదించాను. ఇండస్ట్రియలిస్ట్ ని కాదు ఎంటర్ ప్రెన్యూర్ ని. నేను పార్టీలు మారలేదు.. పార్టీలే మారాయి. కేసీఆర్ కుటుంబానికి అప్పగించారు. కుటుంబ పాలన పెరిగింది. కేసీఆర్ కి తెలివి వుంది. కానీ ఈమధ్య అది దారితప్పింది. నేను వేదిక పెట్టాలని భావించా. రాజకీయాలు అధ్వాన్నంగా మారాయి. పార్టీ పెడితే దానిని కాపాడుకోవడం కష్టం. కొత్త పార్టీ పెడితే బీజేపీ, కాంగ్రెస్ సాయం చేయాలి. కొత్త పార్టీ పెడితే.. చీమల్ని నలిపినట్టు నలిపేస్తారు కేసీఆర్. కోదండరాం బీజేపీలోకి వస్తే సంతోషంగా వుంటుంది. కానీ ఆయన్ని తీసుకువచ్చే చనువు లేదు. నాకు ఎంపీయే సూట్ అవుతుంది. రాజకీయాల్లోకి వచ్చింది కేవలం పదవుల కోసం కాదు. టికెట్ కోసం కండిషన్ పెట్టి రాలేదు.
ఈడీ, సీబీఐ వున్నాయి. తప్పులు చేస్తే శిక్ష తప్పదు. సరైన ఆధారాలు వుండాలి. యాక్షన్ మొదలైంది. ముందస్తు మంచిదా? కాదా అనేది కన్ ఫ్యూజన్ లో వున్నారు. కాంగ్రెస్ పార్టీతో మాకు పోటీలేదు. కేవలం టీఆర్ఎస్ తోనే పోటీ. నన్ను ఎవరూ భయపెట్టి బీజేపీలోకి లాక్కోలేదు. కుటుంబ పాలన పోవాలని నేను వచ్చా. బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు వున్నారు. ప్రజలు సహకరిస్తారు. మంచి ఆశ మంచిదే. యూత్ అంతా బీజేపీ వైపు వస్తున్నారు. బీజేపీకి అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. బీజేపీకి అవకాశం ఉందని నేను వచ్చానన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
Sprite Cool Drink: రంగు మార్చిన ‘స్ర్పైట్’.. 60 ఏళ్ల తర్వాత తొలిసారి..!!