మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సమయంలో తన పదవీకాలంలో రూ. 40,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా.. ఏ నాయకుడు ఏ విధంగా ఎంత డబ్బు సంపాదించాడో తనకు తెలుసన్నారు. ప్రభుత్వం కేవలం రూ.45 విలువ చేసే మాస్క్‌ను రూ.485కి కొనుగోలు చేసిందని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ల కోసం 10,000 పడకలు అవసరమని యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం తెలిపింది. పడకలను అద్దెకు ఇవ్వడానికి నిర్ణయించిన రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని.. ఒకటి ధరకు రెండు పడకలను కొనుగోలు చేయవచ్చని యత్నాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Central Cabinet: కొబ్బరి రైతులకు కేంద్రం శుభవార్త..
ఇదిలా ఉంటే.. కర్ణాటకకు చెందిన ఇద్దరు నేతలకు సంబంధించిన అవినీతి కేసులను సుప్రీంకోర్టు విచారిస్తుంది. జనవరి 5న ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్‌కు సంబంధించిన కొన్ని అక్రమాలకు సంబంధించిన కేసు, యడ్యూరప్పకు సంబంధించిన కేసును విచారించనుంది. కాగా.. సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో యడియూరప్పపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, దీనికి సంబంధించిన అన్ని పత్రాలను జస్టిస్ నాగమోహన్ దాస్ కమిషన్‌కు అందజేయాలని యత్నాల్‌ను కోరారు.
Read Also: AP High Court: ఏపీ ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై హైకోర్టు విచారణ
బీజేపీ హయాంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన 40 శాతం కమీషన్ ఆరోపణలకు యత్నాల్ చేసిన ఆరోపణలే నిదర్శనమని సిద్ధరామయ్య తెలిపారు. 40 శాతం కమీషన్‌పై తమ వాదనకు యత్నాల్ ప్రత్యక్ష రుజువును ప్రభుత్వానికి అందించారని ముఖ్యమంత్రి చెప్పారు. అక్రమాలపై విచారణ జరిపే జస్టిస్ నాగమోహన్ దాస్ కమిషన్‌కు పత్రాలను అందజేయాలని యత్నాల్‌ను కోరుతూ, “అవినీతిని నిర్మూలించాలనే నిజమైన ఉద్దేశ్యం యత్నాల్‌కు ఉంటే, ఆయన తన ఆరోపణలను తార్కిక ముగింపుకు తీసుకెళ్లాలి” అని సిద్ధరామయ్య తెలిపారు.