కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ముందుంటి పోరాటం చేస్తున్నారు.. వైద్యులు, వైద్య సిబ్బంది.. ఇదే సమయంలో.. చాలా మంది కోవిడ్ బారినపడుతూనే ఉన్నారు.. ఇక, సెకండ్ వేవ్ వైద్య రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి ఏకంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది.. ఇక, మృతిచెందిన వైద్యుల సంఖ్య రాష్ట్రాలవారీగా చూస్తే.. అత్యధికంగా బీహార్‌లో 111 మంది వైద్యులు,…
ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలవర పెడుతుంది. రోజుకు దాదాపు మూడు లక్షల వరకు కేసులు నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి. దానికి తోడు బ్లాక్ ఫంగస్ భయపెడుతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రలతో పాటుగా దేశంలోని మరిన్ని రాష్ట్రాలలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు మరో కొత్త ఫంగస్ భారత్ లో బయపడింది. బీహార్ లో కొత్తగా వైట్ ఫంగస్ సోకిన నలుగురిని గుర్తించారు అధికారులు. ఇక ఈ…
కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. భారతీయులు పవిత్రంగా భావించే గంగా నదిలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం.. వందలాది మృతదేహాలు గంగా నదిలో తేలడం తీవ్ర కలకలమే సృష్టించింది.. ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గంగా నదిలో మృతదేహాలపై వస్తున్న కథనాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇది అవాంఛనీయమని పేర్కొన్న కేంద్రం.. కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆరోగ్య శాఖతో సంప్రదించి తరచూ…
దేశంలో మహమ్మారి కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో కేసులను కంట్రోల్ చేయకుంటే ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉన్నది. దీంతో రాష్ట్రాల్లోని కోర్టులు కరోనా మహమ్మారి విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా, బీహార్ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బీహార్ లో రోజువారీ కేసులు పెరుగుతుండటంతో పాటుగా, హైకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ…
కరోనా సెకండ్ వేవ్ విలయమే సృష్టిస్తోంది.. ఎంతోమంది సామాన్యులే కాదు.. వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులు, అధికారులు, ఉద్యోగులు.. ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.. ఎవ్వరైతే నాకేంటి అంటూ అందరినీ టచ్ చేస్తోంది వైరస్.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా, అధైర్యపడినా ప్రాణాలు తీస్తోంది.. ఇక, తాజాగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ సింగ్ కూడా కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఆయన.. పాట్నాలోని ఓ ఆస్పత్రిలో…
కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కల్లోలమే సృష్టిస్తోంది.. అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.. ఇక, కోవిడ్‌తో ముందుండి పోరాటం చేసే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో మహమ్మారి బారినపడుతూనే ఉన్నారు.. తాజాగా.. బీహార్‌లోని పాట్నా ఎయిమ్స్ లో ఏకంగా 384 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. బాధితుల్లో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. గతంలో పాజిటివ్ కేసులు నమోదు అయినా.. ఒకే సారి ఇంత పెద్ద…
జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు బీహార్ మహిళలంతా అండగా నిలుస్తున్నారు. జేడీయూను గెలిపించి ఎలాగైనా నితీశ్‌ను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోపెట్టేందుకు నడుం బిగించినట్లు కనిపిస్తున్నారు. ఉదయం నుంచీ రసవత్తరంగా సాగుతున్న బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళుతోంది. నితీశ్ కుమార్ విధానాలను బీహార్‌లోని పురుష ఓటర్లు విభేదిస్తున్నా.. మహిళా ఓటర్లు మాత్రం ఆయనను ఆదరిస్తున్నారు. ఇదే విషయంపైనే ఇప్పుడు స్థానిక గ్రామాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్డీఏ కూటమి భాగస్వాములైన బీజేపీ-జేడీయూల్లో బీజేపీయే ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో…