బీహార్ రాజధాని పాట్నాలో సుందరవతి అనే కళాశాల ఉంది. పాట్నాలోని ఆ మహిళల కళాశాలకు మంచి పేరు ఉంది. ఈ కాలేజీలో 1500 మంది వరకు విద్యార్థినులు చదువుతున్నారు. ఇప్పుడు ఈ కాలేజీ యాజమాన్యం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. కాలేజీకి వచ్చే విద్యార్థినులు తప్పని సరిగా జడ వేసుకొని రావాలని, లూజ్ హెయిర్‌తో వస్తే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, సెల్ఫీలు దగడంపై నిషేదం విధించారు. దీంతో పాటుగా డ్రెస్‌కోడ్‌ను కూడా తీసుకురావడంతో స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి డ్రెస్ వేసుకొని రావాలో కాలేజీ ఎలా నిర్ణయిస్తుందని, ఇది తమ స్వేచ్చకు భంగం కలిగించినట్టే అవుతుందని విద్యార్ధినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలా చదువుతున్నారనే దానిపై దృష్టిపెట్టాలిగాని, ఇలా డ్రెస్ కోడ్ పేరుతో విద్యార్థినుల స్వేచ్చకు భంగం కలిగించకూడదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.