రాఖీ పండగ రోజున బీహార్‌లోని సారణ్ జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. 25 ఏళ్ల మన్మోహన్ అనే యువకుడు పాములు పట్టడంలో నేర్పరి. తాను నివశించే చుట్టుపక్కల ప్రాంతాల్లో పాములు పట్టుతుంటాడు. అయితే, అందరిలా రాఖీ పండుగనే చేసుకుంటే ప్రత్యేకత ఏముంది అనుకున్నాడు. రెండు పాములకు రాఖీలు కట్టాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగానే రెండు పాములను పట్టుకున్నాడు. వాటి తోకలను పట్టుకొని పడగపై బొట్టు పెట్టాడు. అయితే, అందులో ఒకపాము మెల్లిగా కదులుతూ ముందుకు వచ్చింది. కానీ దానిని ఆ యువకుడు గమనించలేదు. రాఖీ కడదామని అనుకున్న సమయంలో ఆ పాము అతని కాలివేలుపై కాటు వేసింది. అయితే, గతంలో చాలామార్లు పాములు కరిచాయని, తనకు ఏమీ కాలేదని ధీమాను వ్యక్తం చేశాడు. రాఖీ కట్టే సమయానికి పాము విషం గుండెకు చేరడంతో కుప్పకూలిపోయాడు. రాఖీ పండుగ రోజున ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది.
बिहार के सारण में बहन से साप को राखी बंधवाना महंगा पड़ गया साप के डसने से भाई की चली गई जान pic.twitter.com/675xsgnZ6N
— Tushar Srivastava (@TusharSrilive) August 23, 2021
Read: వైరల్: చిన్న ఆలూ చిప్స్‌ను రూ.14 లక్షలకు అమ్మిన చిన్నారి…