మొన్నటి రోజున రాష్ట్రంలో సంపూర్ణ మధ్యపాన నిషేధం విధిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన మరుసటి రోజే అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం సీసాలు కనిపించడంతో విపక్షాలు మండిపడిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తామని స్వయంగా బీహార్ ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, ఇప్పుడు దేవాలయాల ఆదాయంపై నాలుగు శాతం పన్నులు చెల్లించాలని బీహార్ బోర్డ్ రిలీజియస్ ట్రస్ట్ ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది సొంత ఇంటి పరిసరాల్లోనే దేవాలయాలు నిర్మించుకుంటున్నారు.
Read: టిక్కెట్ రేట్లు, షోస్ పై స్పందించిన దర్శకేంద్రుడు!
ఇలా ఇంటి ప్రాంగణంలో ఆలయాలను నిర్మించుకున్నప్పటికీ వాటిని కూడా రిజిస్టర్ చేయించుకోవాలని, ఆ ఆలయంపై వచ్చే ఆదాయంలో నాలుగు శాతం పన్నురూపంలో చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంటి ప్రహరీ గోడ లోపల నిర్మించుకున్నా, ఇంటి బయట నిర్మించినా ఆలయం ఆలయమే అని, వాటిని తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు, పూజారులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దీనిపై బీహార్ స్టేట్ బోర్డ్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ తులసాయన్ సైగల్ స్పందించారు. ఉది పన్ను కాదని, కేవలం వార్షిక సేవా చార్జీ మాత్రమే అని అన్నారు