ఓ ఇంటివాడైన తేజస్వి యాదవ్.. బాల్య స్నేహితురాలితో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు… ఇవాళ తన బాల్య స్నేహితురాలిని వివాహం చేసుకున్నారు తేజస్వి యాదవ్.. ఢిల్లీలో తేజస్వి యాదవ్-రాచెల్ వివాహ వేడుక ఘనంగా జరిగింది… ఢిల్లీలోని తేజస్వి సోదరి మిసా భారతి ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక నిర్వహించారు.. కరోనా నేపథ్యంలో.. ఈ వేడకకు కుటుంబసభ్యులు, సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు.. ఇక, ఈ వివాహ వేడుకకు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్, రాజ్యసభ ఎంపీ మీసా భారతి, ఇతర కొంతమంది నాయకులు కూడా హాజరయ్యారు..
Read Also: ప్రధాని మోడీతో విజయసాయిరెడ్డి భేటీ.. వీటిపై చర్చ
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు తేజస్వి యాదవ్… మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడైన తేజస్వి యాదవ్.. హర్యానాకు చెందిన రాచెల్‌ని వివాహం చేసుకున్నారు.. పాఠశాలలో చదువుకునే రోజుల నుంచే ఇద్దరికీ పరిచయం ఉంది.. ఇక, వీరి వివాహం సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అనేక మంది బౌన్సర్లు ఫామ్ హౌస్ వెలుపల నిలబడి కనిపించారు.. ప్రధాన గేటులోకి అనుమతించే ముందు అన్ని వాహనాల వివరాలను తనిఖీ చేసిన తర్వాతే పంపించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి. మరోవైపు వీరి నిశ్చితార్థం.. పెళ్లికి ఒకరోజు ముందు జరిగినట్లు తెలుస్తోంది.. లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఏడుగురు సంతానం ఉండగా.. తేజస్వి చిన్నవాడు.. ప్రస్తుతం బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గతంలో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!