ఎంతటి విషాదం.. కొద్దిసేపట్లో పెళ్లి.. ఇంతలోనే వరుడు అలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ పెళ్లి వేడుక జరుగుతుంది.. బంధువులు, స్నేహితులు పెళ్ళిలో అటుఇటు తిరుగుతూ హడావిడి చేస్తున్నారు.. వధువు.. తన కొత్త జీవితం గురించి కళలు కంటూ వరుడు కోసం ఎదురుచూస్తుంది. అంతలోనే బ్యాండ్ బాజా భారత్ తో వరుడు కారులో వచ్చేశాడు. అతను రావడం .. వధువుకు తాళికట్టడంతో పెళ్లి ముగిసేది.. కానీ, విధి వారి జీవితాన్ని మరోలా రాసింది. కారు నుంచి దిగిన వరుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పెళ్లి హడావిడి వలన కుప్పకూలాడేమో అనుకోని హాస్పిటల్ కి తీసుకెళ్లగా డాక్టర్ చెప్పింది విని పెళ్లి వారు శోకసంద్రంలో మునిగిపోయారు.
పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా పరిధిలోని చరద్వాలి గ్రామానికి చెందిన మనీష్ గిరికి, యోగాపట్టిలోని అమేథియా గ్రామానికి చెందిన చందా అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. వారి పెళ్ళికి కుటుంబ సభ్యులు గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. సంగీత్, హల్దీ వేడుకల అనంతరం పెళ్లి రోజు రానే వచ్చింది. అందరు ముస్తాబై పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తున్నారు.. కారులో పెళ్లి కొడుకు రావడంతో అందరి కళ్ళు వరుడిపై పడ్డాయి. మనీష్ కారు దిగగానే కుప్పకూలిపోయాడు. ఈ అనుకోని సంఘటనకు అక్కడున్నవారందరు షాక్ అయ్యారు. వెంటనే అతనిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హార్ట్ అటాక్ తో మనీష్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. వరుడు మృతితో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న వధువు స్పృహ కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు