రోడ్డు వేయిస్తాం నయా నగరాన్ని స్థాపిస్తాం ఇది ప్రతి నాయకుడు చెప్పేమాటలే. కానీ.. వారి మాటలు మాటలకు మాత్రమే పరిమితం మవుతున్నాయి. అడపాదడపా రోడ్డు వేయింది. చేతులు దులుపుకుంటారు. కానీ.. వర్షం వస్తే గాని ఆరోడ్డు పరిస్థితి అప్పటివరకు తెలియదు. వాన జల్లులతో గుంతలు, రోడ్డులో రాళ్లు అస్తవ్యస్తంగా మారి ప్రయాణికులకు నగరవాసులకు ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. దేశంలోనే ఇలాంటివన్నీ సాధారణంగా మారాయి. కానీ ఎప్పుడైనా ఖాళీ లేకుండా ఉన్న గుంతల వరుసలు వున్న రోడ్డును చూశారా. చూడకపోతే ఒక్క సారి బీహార్ వైపు ఓలుక్ వేస్తే చాలు ఓరేంజ్ గుంతలు వరుస క్రమంలో దర్శనమిస్తాయి.
మధుబని జిల్లా జాతీయ రహదారి 227పై 20 కిలోమీటర్ల మేర విస్తరించిన 100 భారీ గుంతల వీడియో అది. వాటిని చూస్తుంటే రోడ్లపైనే చిన్నపాటి కుంటలు వెలిశాయా? అన్నట్టు కనిపిస్తున్నది. ఇక్కడ సుమారు 15వేల కుటుంబాలు జీవనం వున్నాయి. 500 వరకు చిన్న చిన్న దుకాణాలు వున్నాయి. ఇక్కడి ప్రజలు 2015 నుంచి ఈ దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ భయంకరమైన పరిస్థితిని దైనిక్ భాస్కర్ వార్తాపత్రికకు చెందిన ప్రవీణ్ ఠాకూర్ అనే వ్యక్తి ఏరియల్ వ్యూ ద్వారా చిత్రీకరించి పోస్టే చేసారు. దీంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.
ఈ రహదారిని చూపిస్తూ డబుల్ ఇంజిన్ సర్కారులో రోడ్ల పరిస్థితి ఇదీ! అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు..ఈ రోడ్లు అచ్చం “తకేషీ క్యాస్టిల్” అనే గేమ్ షోను తలపించే విధంగా ఉన్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైరికల్ గా ఎన్డీయే సర్కారును ఎద్దేవా చేస్తున్నారు. ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్, మిత్ర పక్షం బీజేపీపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే తరచూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విమర్శలకు దిగే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన ఆయన… ఇది 90వ దశకంలోని బిహార్‌లోని జంగిల్ రాజ్ రోడ్ల పరిస్థితిని గుర్తుచేస్తుందని కామెంట్ చేశారు. అయితే నితీశ్ కుమార్ మాత్రం రాష్ట్రంలో రోడ్లు బాగున్నాయంటూ ఇటీవలే చెప్పారని.. దానికి నిదర్శనమే ఈ రోడ్లంటూ పీకే ట్వీట్ చేశారు. ఆదర్శవంతమైన ఈ రోడ్లని ప్రజలు.. నితీష్ కు చూపాలని ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా కామెంట్ చేశారు.
కాగా.. ఈ రోడ్డు మరమ్మతులు చేసేందుకు ఇప్పటికి మూడుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ… కాంట్రాక్టర్లు మాత్రం అసంపూర్తిగా పనులు చేసి, చేతులు దులుపుకున్నారు. 2024 డిసెంబర్ నాటికి బిహార్‌లోని రోడ్లను అమెరికా రోడ్లతో సమానంగా తీర్చిదిద్దుతామని ఇటీవల కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ సారైనా ఈ రోడ్డుకు దశ మారుతుందా, లేదా అనే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. రోడ్డు వేస్తారనే ఆశతో అక్కడి ప్రజలు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
90 के दशक के जंगलराज में बिहार में सड़कों की स्थिति की याद दिलाता यह बिहार के मधुबनी जिले का नेशनल हाईवे 227 (L) है।
अभी हाल में ही #Nitishkumar जी एक कार्यक्रम में पथ निर्माण विभाग के लोगों को बोल रहे थे कि बिहार में सड़कों की अच्छी स्थिति के बारे में उन्हें सबको बताना चाहिए। pic.twitter.com/Qp0ehEluty
— Prashant Kishor (@PrashantKishor) June 23, 2022