Tragedy: బీహార్‌లోని మాధేపురాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కోసం కలలు కంటున్న యువతి కన్నతండ్రి చేతిలోనే హతమైంది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ తండ్రి కూతురిని దారుణంగా హతమార్చాడు. జిల్లాలోని సింహేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత్ర తోలాలో ఈ ఘటన జరిగింది. నిందితుడి తండ్రి పేరు శివరామ్ సా. మద్యం కోసం శివరామ్ తన 24 ఏళ్ల కుమార్తె తలపై తుపాకీతో కాల్చాడు. మృతురాలు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ పెళ్లి నిమిత్తం గ్రామానికి వచ్చింది. పెళ్లి చేసుకుని సంతోషకరమైన ప్రపంచం గురించి కలలు కంటున్న ఆమె కల నెరవేరకముందే, ఆమెకు దురదృష్టకరమైన ముగింపు ఎదురైంది.
Read Also: Baba sitting on a Hot Griddle: ఈ బాబా చాలా హాట్ గురూ.. వేడివేడి పెనంపై కూర్చున్నా!
నిందితుడైన శివరాం మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే యువతి కుటుంబ పోషణ నిమిత్తం ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంది. యువతికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. మేలో పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆ యువతి బీహార్‌లోని తన గ్రామానికి వెళ్లింది. పెళ్లికి ముందు ఆమె ఇల్లు కట్టుకుంది. కానీ తండ్రి మద్యం కోసం ఎప్పుడూ డబ్బు ఇవ్వాలని వేధించేవాడు.
Read Also: Mega Power: రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘మెగా పవర్’ ఫస్ట్ లుక్ విడుదల!
సంఘటన జరిగిన రోజు కూడా శివరామ్ సాహ్ తన కుమార్తె కొత్త ఇంటికి తాగడానికి డబ్బులు అడిగేందుకు వెళ్లాడు. అయితే బాలిక డబ్బులు ఇవ్వకపోవడంతో బాలికతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా ఇంటి సభ్యులను దుర్భాషలాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత బాలిక తండ్రికి నచ్చజెప్పింది. దీంతో శివరాం అక్కడి నుంచి తిరిగి వెళ్లి రాత్రి ఓ వ్యక్తితో కలిసి తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తి ముఖానికి కండువా చుట్టి ఉంది. యువతితో మాట్లాడడం ప్రారంభించిన తండ్రి ఆమె తలపై కాల్చి మోటారు సైకిల్‌పై పారిపోయాడు. తుపాకీ శబ్దం విని కుటుంబీకులు గ్రామస్థుల సహాయంతో ఆమెను మాధేపురాలోని జన్ నాయక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.