Facebook Love: ఆన్ లైన్లో ప్రేమలు చాలా వరకు ఫేక్ అని మరోమారు రుజువైంది. నేటి యువత ఆకర్షణకు ప్రేమకు తేడా తెలియకుండా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో యువతితో స్నేహం చేశాడు. ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత యువతి కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా వారికి తెలియకుండా తన ప్రియుడి వద్దకు వెళ్లింది. దీని తర్వాత వారిద్దరూ ఛప్రాలో వివాహం చేసుకున్నారు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు నెలల పాటు వారి సంసారజీవితం సాఫీగానే సాగింది. ఆ తర్వాత భర్త కనిపించకుండా పోయాడు. తన భర్త ఏమైపోయాడని కంగారుతో భార్య అతడికి ఫోన్ చేసింది. ఆ సమయంలో అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.
Read Also: Super Sketch: కృష్ణ కోసం సిమ్రాన్‌ను చంపిన జ్యోతి.. దారం, ముక్కు పుడకే ఆధారం
బాధితురాలి వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రంలోని సౌనోలి గ్రామానికి చెందిన అంకిత్ కుమార్, భాకురా భితాతి గ్రామానికి చెందిన ప్రీతి కుమారి అనే యువతితో ఫేస్‌బుక్‌లో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ మెసెంజర్‌లో చాటింగ్ చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ ఒకరి నంబర్ ఒకరు తీసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య వాట్సాప్‌లో సంభాషణ మొదలైంది. కొంతకాలం తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2022 డిసెంబర్ 27న కోర్టులో వివాహం జరిగిందని యువతి తెలిపింది. కొన్ని రోజుల తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం ఒక దేవాలయంలో పెళ్లిచేసుకున్నట్లు బాధితురాలు వెల్లడించింది.
Read Also:Jawan: కింగ్ ఖాన్ షూటింగ్ కంప్లీట్ చేశాడు… చెప్పిన సమయానికే వస్తాడా?
పెళ్లయ్యాక ఢిల్లీకి చేరుకుని నాలుగు నెలలు బాగానే ఉన్నామని తెలిపింది. కొన్ని రోజుల తర్వాత అంకిత్ తనకు చెప్పకుండా ఊరికి పారిపోయాడు… గ్రామానికి చేరుకున్న తర్వాత తన మొబైల్ నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన కోసం ఎదురుచూసి చివరకు ఢిల్లీ నుంచి గ్రామానికి చేరుకుంది. ఆ సమమంలో అంకిత్, అతని కుటుంబం ఇంట్లోకి రానివ్వలేదు. ప్రేమలో మోసపోయిన ప్రీతికి మరో మార్గం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. మష్రక్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ, బాధితురాలు మొత్తం సంఘటనను తెలియజేసి, తన భర్తపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.