40 మంది మహిళలకు ఒక్కడే భర్తట.. వారి పిల్లలకు అతనే తండ్రికూడనట.. ఒకే ప్రాంతానికి చెందిన 40 మంది మహిళలు చెప్పింది విన్న అధికారులు షాక్ కు గురయ్యారు. బీహార్ లోని అర్వాల్ లోని వార్డు నంబర్ 7లో 40 మంది మహిళలు తమ భర్త పేరును రూప్ చంద్ అని చెప్పారు.
గురువారం జమ్మూకశ్మీర్లోని పూంచ్లో ఐదుగురు సైనికులను చంపిన ఉగ్రదాడి 2024 లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర కావచ్చునని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర పేర్కొన్నారు.
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం మరోమారు కలకలం చేరింది. మద్యపాన నిషేదంఉన్న బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది డిసెంబర్లో కల్తీ మద్యం సేవించి 75 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే రాష్ట్రంలోని మోతీహరి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందారు.
రైల్వే భూముల కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు. తేజస్వి ఉదయం 11 గంటలకు విచారణలో చేరే అవకాశం ఉంది. ఇదే కేసులో మార్చి 25న తేజస్వీ యాదవ్ ను సీబీఐని ప్రశ్నించింది.
Success Story: కష్టపడే తత్వం, తెలివితేటలు ఉంటే చాలా ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొని గొప్పగా మారొచ్చు. అందుకు ఈ దిల్ఖుష్కుమార్ జీవితమే ఓ ఉదాహరణ. పెద్దపెద్ద చదువులు చదివినా కొన్ని సార్లు రాని పేరు తన కష్టం, తెలివితో సాధించుకున్నాడు. రిక్షాపుల్లర్, సాధారణ డ్రైవర్, కూరగాయల వ్యాపారి స్థాయి నుంచి కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దేశంలో పేరొందిన ఐఐటీ, ఐఐఎం గ్యాడ్యుయేట్లకు తన సంస్థలో ఉద్యోగం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Anti-India agenda: భారత్ అంటేనే నిలువెల్ల విషంలో మాట్లాడుతుంటుంది ముస్లిం దేశాల కూటమి ‘‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)’’. ఇప్పటికే పలుమార్లు భారత అంతర్గత విషయాలపై స్పందిస్తూ ఇండియాకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసింది. అయితే ఎప్పటికప్పుడు ఐఓసీ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రామనవమి అల్లర్లపై ఓఐసీ అర్థపర్థం లేని ఆరోపనలు చేసింది. దీంతో మరోసారి తీవ్రంగా స్పందించింది భారత్.
Amit Shah: సీఎం నితీష్ కుమార్ అధికార దాహం వల్లే లాలా ప్రసాద్ యాదవ్ ఒడిలో కూర్చున్నారని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీహార్ నవడాలో పర్యటించిన ఆయన జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ మహాఘటబంధన్ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఆదివారం నవడా జిల్లాలోని హిసువా ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీహార్ లో రామనవమి రోజుల చెలరేగిన మతఘర్షణల గురించి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జంగిల్ రాజ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో ఉన్న ప్రభుత్వం…
Tragedy: బీహార్లోని మాధేపురాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కోసం కలలు కంటున్న యువతి కన్నతండ్రి చేతిలోనే హతమైంది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ తండ్రి కూతురిని దారుణంగా హతమార్చాడు.