BJP Appoints New Chiefs: దేశంలో బీజేపీ బలోపేతం కొత్త వ్యూహాన్ని అమలు చేసింది. పలు రాష్ట్రాలకు కొత్త పార్టీ చీఫ్‌లను నియమించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ తన ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్ర యూనిట్లకు కొత్త చీఫ్‌లను గురువారం నియమించింది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, లోక్‌సభ ఎంపీ సీపీ జోషి రాజస్థాన్ బీజేపీ చీఫ్‌గా నియమితులయ్యారు. బీహార్‌కు, సంజయ్ జైస్వాల్ స్థానంలో బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడు సామ్రాట్ చౌదరి కొత్త రాష్ట్ర చీఫ్‌గా నియమితులయ్యారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడనుందా..? 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో భారీ కుదుపు
రాజస్థాన్‌లో, జైపూర్‌లోని అంబర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్న సతీష్ పూనియా స్థానంలో సీపీ జోషి బీజేపీ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. బీజేపీ ఒడిశా యూనిట్ అధ్యక్షుడిగా మాజీ రాష్ట్ర మంత్రి మన్మోహన్ సమాల్ కూడా నియమితులయ్యారు. ఈ నియామకాలను బీజేపీ జాతీయ అధిష్ఠానం జరిపింది.