Nithish Kumar : సీఎం నితీష్‌కు షాక్.. బీహార్ కులగణనపై పాట్నా హైకోర్టు స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithish Kumar : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు పాట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో తన ఆధ్వర్యంలో చేపడుతున్న కుల గణనను హైకోర్టు నిలిపేసింది. బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకునే ఉద్దేశంతో నితీష్ కుమార్ కుల ఆధారిత సర్వే నిర్వహిస్తున్నారు. నిజానికి కుల గణన చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అందుకు నితీష్ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సార్లు కోరారు. దీనిపై కేంద్రం నుంచి సరైన సమధానం లేకపోవడంతో నితీష్ ప్రభుత్వమే స్వయంగా తమ రాష్ట్రంలో కుల గణనకు పూనుకుంది. ఈ గణనకు బీజేపీ మినహా బిహార్‌లోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. దీంతో జనవరి 7న అధికారికంగా కుల గణన ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కులాల వారీగా ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిని తెలుసుకునే సర్వేలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని విమర్శలు వచ్చాయి.
Read Also: CM Jagan : సీఎం జగన్‌ను కలిసిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వే పై వస్తున్న వ్యతిరేకతపై నితీశ్ కుమార్ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. సమాజంలో వెనుకవడిన వర్గాల ప్రజలకు ఈ సర్వే ద్వారా మెరుగైన లబ్ధిని అందిస్తుందని, ప్రభుత్వ లక్ష్య సహాయాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందన్నారు. ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కలు వస్తున్నాయి. అయితే ఓబీసీ వర్గాలకు చెందిన లెక్కలు తేలడం లేదు. ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికే బిహార్ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. రూ.500 కోట్ల బడ్జెట్ తో ఆరంభించిన ఈ సర్వే రెండు భాగాలుగా సాగుతోంది. అయితే ఇప్పటికే ఒక సర్వే పూర్తైంది. మొదటి విడతలో జనవరి 7 నుంచి 21 తేదీ వరకు మధ్య కులాల సర్వే జరిగింది. ఇక రెండవ విడత సర్వే ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు నిర్వహించాలి. కానీ కొన్ని అభ్యంతరాలు, అడ్డంకుల నడుమ సర్వే అర్ధాంతరంగా నిలిచిపోవాల్సి వచ్చింది.
Read Also: DK Shiva kumar: శివ శివ.. నీకే ఎందుకిలా.. టైం బాగోలేనట్టుంది
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?