Wedding: పెళ్లి పీటలపై ఆగిన పెళ్లిళ్లు సినిమాల్లో చూస్తుంటాం.. పెళ్లి జరుగుతుండగా.. ఎవరో ఒకరు వచ్చి.. ఆ పండీ అనే డైలాగ్ వేయడం పాత సినిమాల్లో చూశాం.. అయితే, నిజం జీవితంలోనూ తరచూ పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. అయితే, ఓ పెళ్లికూతురు కాసేపట్లో పెళ్లనగా కాబోయేవాడి మెడలో వరమాల వేస్తూ.. వరుడు నల్లగా ఉన్నాడు నేను చేసుకోనని మొండికేసింది.. అసలే ఈ జనరేషన్‌లో పెళ్లి చూపుల తర్వాతే ఆగడంలేదని విమర్శలు ఉన్నాయి.. ఫోన్లు, చాటింగ్‌లు, మీటింగ్‌లు.. ఇలా పెళ్లి వరకు వారికి ఓ అండర్‌స్టాండింగ్ వస్తుంది.. కానీ, పెళ్లి చూపుల్లో ఆ యువతి ఏం చేసిందో.. తెలియదు.. కానీ, ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
Read Also: MP Margani Bharat: ఎంపీ మార్గాని భరత్‌పై కేసు నమోదు
బీహార్ రాష్ట్రంలోని బాగల్పుర్లోని కహల్గావ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వినోద్ మండల్ కుమార్తె కిట్టూ కుమారికి.. ధనౌరా ప్రాంతానికి చెందిన డాక్టర్ వీరేంద్ర సింగ్ తనయుడు నీలేశ్ కుమార్ సింగ్‌తో.. వివాహం నిశ్చయించారు.. ఇక, పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి.. ఈ తంతు చూసి.. కొత్త జంటను ఆశీర్వదించడానికి స్నేహితులు, బంధువలు, స్థానికులు అంతా వచ్చారు.. వరుడు ఊరేగింపుగా వివాహ వేదికకు చేరుకున్నాడు.. కొద్దిసేపట్లో దండలు మార్చుకునే కార్యక్రమం ప్రారంభమైంది.. కాబోయే వరుడిని చూడగానే యువతి ముఖంలో హావభావాలు ఒక్కసారిగా మారిపోయాయి.. అప్పటి వరకు సంతోషంగా ఉన్న పెళ్లి కూతురు.. అతడిని చూడగానే యూటర్న్ తీసుకుంది.. నాకు ఇతడితో పెళ్లి వద్దని తెగేసి చెప్పింది.. వరుడి మెడలో దండ వేసేందుకు, తిలకం పెట్టేందుకు నిరాకరించింది.. కుటుంబ సభ్యులు, బంధువులు, చివరకు ఆ పెళ్లి కూతురు తండ్రి రంగంలోకి దిగి సద్దిచెప్పే ప్రయత్నం చేసినా.. యువతికి పలు హామీలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.. ఆపై కుటుంబ సభ్యులు ఆమెను మందలించే ప్రయత్నం చేశారు. కొందరైతే గట్టిగా బెదిరించారు. వధువు వెనక్కి తగ్గడం అటుంచితే.. మరింత మొండికేసింది.. వివాహ వేదిక నుంచి దిగిపోయింది.. చేసేది ఏమీ లేక చివరకు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు ఇరు కుటుంబాల సభ్యులు.