బీహార్ లోని పిదాసిన్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు నిరంజన నదిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు కాపాడార. అయితే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. మరోవైపు నదిలో గల్లంతైన ఇద్దరు బాలికల కోసం గాలిస్తున్నారు.
బీహార్లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. 3 అడుగుల భూమి విషయంలో ఓ వ్యక్తిని చితకబాది.. అనంతరం చెవి కోసేశారు. గ్రామానికి చెందిన కొందరు బడా బాబులు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. దీంతో బాధితుడు నిరసన తెలపడంతో అతనిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బీహార్లోని బెగుసరాయ్ జిల్లా లఖో పోలీస్ స్టేషన్ పరిధిలో శివాలయంలో ఉన్న శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై.. NH 31 జాతీయ రహదారిపై తీవ్ర గందరగోళం సృష్టించారు.
Girlfriend Birth Day: గర్ల్ ఫ్రెండ్ పుట్టిన రోజు ఓ యువకుడికి చావు వరకు తీసుకెళ్లింది. ప్రియురాలి బంధువులు అతడిని చితక్కొట్టారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ఛప్రాలో జరిగింది. ప్రస్తుతం యువకుడిని ఆస్పత్రికి తరలించిన వీడియో అక్కడ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియురాలి పుట్టిన రోజులు
రైలు ఢీకొని రెండు మొసళ్లు చనిపోయిన ఘటన బీహార్లోని పశ్చిమ చంపారన్లో జరిగింది. బగాహా-వాల్మీకినగర్ రోడ్ రైల్వే స్టేషన్ మధ్య మంగళ్పూర్ ఔసాని హాల్ట్ సమీపంలో మొసళ్లను రైలు ఢీకొనడం కనిపెట్టారు. దీంతో వెంటనే రైల్వే సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.
కేంద్రమంత్రి అమిత్ షా శనివారం బీహార్లో పర్యటించారు. ఝంజర్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్లపై విరుచుకుపడ్డారు. బీహార్ దుస్థితికి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ బాధ్యులని విమర్శించారు.
Bihar: రామచరిత్ మానస్ మరోసారి వివాదాల్లోకి వచ్చింది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ‘రామచరిత మానస్’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా బీహార్ మంత్రి కూడా హిందూ గ్రంథాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పవిత్ర రామచరితమానస్ గ్రంథాన్ని విషపదార్థమైన ‘సైనైడ్’తో పోల్చాడు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు పొలిటికల్ దుమారం ప్రారంభమైంది.
Boat capsized: బీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన గురువారం రోజున ముజఫర్ పూర్ లో జరిగింది. బాగ్మతి నదిలో పడవ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.