Bihar CM Convoy: సీఎం కాన్వాయ్ కోసం గంటసేపు ఆగిన అంబులెన్స్.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambulance stopped 1 Hour for Bihar CM Nitish Kumar’s Convoy: తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిన్నారిని తరలిస్తున్న అంబులెన్స్‌ను సుమారు గంట పాటు పోలీసు అధికారులు ఆపేశారు. సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను ఆసుపత్రికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన పాట్నాలో శనివారం చోటుచేసుకుంది. పాట్నా సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను ఆపడంతో.. అనారోగ్యంతో ఉన్న చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఈ ఘటనకు సంబందించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నలందలో ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభించి సీఎం నితీష్ కుమార్ పాట్నాకు తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో సీఎం ప్రయాణానికి వీలుగా పాట్నా పోలీసులు అన్ని ట్రాఫిక్‌లను నిలిపివేశారు. సరిగ్గా అదే సమయంలో అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళుతున్న ఓ అంబులెన్స్.. ఫాతుహా-దానియావాన్ జాతీయ రహదారిపై రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ సమీపంలో ట్రాఫిక్‌లో గంటసేపు చిక్కుకుపోయింది. చిన్నారి ఆరోగ్యం బాగాలేదని, అంబులెన్స్‌ను వెళ్లేందుకు అనుమతించాలని చంటిబిడ్డ కుటుంబీకులు భద్రతా అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది.
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
Also Read: IND vs ENG: అంపైర్లు మ్యాచ్ రద్దు ప్రకటించకముందే.. హోటల్‌కు వెళ్లిపోయిన ప్లేయర్స్!
అంబులెన్సులో చంటిబిడ్డతో ఉన్న మహిళ ఆందోళన చెందింది. అంబులెన్స్ సుమారు గంటపాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నందున చిన్నారి ఆరోగ్యం కాస్త విషమించింది. చిన్నారి ఏడుస్తుండగా తల్లి ఊయల ఊపుతూ ఓదార్చింది. ఇందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో నెటిజన్లు పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం బిహార్‌లోనే ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. అంబులెన్సును ఆపిన పోలీసును గుర్తించినప్పటికీ.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడైనా పోలీసులను ప్రభుత్వం హెచ్చరిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!