విపక్షాల ఐక్యతను బీహార్ సీఎం నితీష్ వదిలేస్తున్నారా.. మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి మళ్లీ చేరబోతున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరసగా భేటీలు చూస్తే కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఆయన రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్‌తో భేటీ అయ్యారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు, జేడీయూలో చీలక గురించి భయపడుతున్నారా..? అనే రూమర్స్ తెరపైకి వచ్చాయి.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ యాదవ్, రబ్రీ దేవిలపై ఉద్యోగాల కుంభకోణంలో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
రాజకీయ పార్టీలు ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేసుకోవడం సహజం. అలాగే రాజకీయ నాయకులు సైతం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. విమర్శలు చేసుకోవడమే కాదు.. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పోస్ట్‌లతో, కరపత్రాలతో ప్రచారం కూడా చేసుకుంటారు.
Love Story: బీహార్‌లో ఓ విచిత్రమైన ప్రేమకథ తెరపైకి వచ్చింది. ఇక్కడ ఒక అబ్బాయి, అమ్మాయి సోషల్ మీడియాలో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఛాటింగ్ మొదలైంది. తర్వాత ఇద్దరూ నంబర్లు మార్చుకున్నారు.
బీహార్ ప్రభుత్వం కార్యాలయాల్లో కొనసాగుతున్న సంస్కృతికి విరుద్ధంగా ఉన్నందున కార్యాలయంలో జీన్స్, టీ-షర్టులు వంటి సాధారణ దుస్తులను ధరించవద్దని రాష్ట్ర విద్యా శాఖ సిబ్బందికి తెలిపింది. టీషర్టులు, జీన్స్‌లతో కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులకు మినహాయింపు ఇస్తూ విద్యాశాఖ డైరెక్టర్ (పరిపాలన) బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
సాధారణంగా ఉపాధ్యాయ(టీచర్) పోస్టులను భర్తీ చేసేటప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న వారితోనే భర్తీ చేస్తారు. టీచర్ పోస్టు జిల్లాస్థాయి పోస్టు. కాబట్టి సొంత రాష్ట్రంలోని వారితో భర్తీ చేస్తారు.
పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఓ వివాహ కార్యక్రమంలో పాట పాడుతూ ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. మహిళ పాడుతున్న మైక్‌లో కరెంట్ ప్రవాహం పెరగడంతో ఆమె మరణానికి దారితీసింది.
యువత ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.. తమ వయస్సును కూడా మరచి మేము యూత్ అంటూ చెడు వ్యసానాలకు బానిసలుగా మారుతున్నారు.. చదువులు పక్కన పెట్టి సిగరెట్లు, మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారు. అలా టెన్త్ చదివే ఓ విద్యార్థి బహిరంగంగానే పొగ తాగడాన్ని గమనించిన స్కూల్ టీచర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ విద్యార్థిని టీచర్లు బెల్టులతో విచక్షణా రహితంగా కొట్టడంతో అతను మృతి చెందాడు.. ఈ దారుణ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.. వివరాల్లోకి…
బీహార్‌లో రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలను పండిస్తున్నారు. లాంగ్ ఓక్రా, రాయల్ లిచ్చి, మఖానా మరియు పుట్టగొడుగుల ఉత్పత్తిలో బీహార్ నంబర్ వన్ రాష్ట్రంగా మారింది. అయితే ఉద్యాన పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కూడా ఇస్తోంది.