బీహార్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. నలంద పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్బైత్ గ్రామంలో ఓ యువకుడిని ఇంటి నుంచి తీసుకుని వెళ్లిన తన స్నేహితుడు అనంతరం కాల్చిచంపాడు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. అయితే ఘటనా స్థలం నుంచి పారిపోతున్న ఇద్దరు స్నేహితులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి ఒక పిస్టల్, 14 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మహ్మద్ అల్మాజ్(18)గా గుర్తించారు.
బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కుల గణనకు సంబంధించిన నివేదికను బహిరంగపరిచింది. ఇందులో రాష్ట్రంలోని కులాల పరిస్థితి గురించిన సమాచారం అందించారు. కాగా, శుక్రవారం సుప్రీంకోర్టులో కుల గణనపై విచారణ జరిగింది.
PM Modi: దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రం కులగణన చేపట్టింది. దానికి సంబంధించిన వివరాలను ఈ రోజు ప్రకటించింది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ ఎన్నికల్ ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు కులం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం ధ్వజమెత్తారు.
Rahul Gandhi: దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రం కులాల వారీగా సర్వే చేసింది. కుల గణన ఫలితాలను ఈ రోజు వెల్లడించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం చేసిన ఈ పనిని కాంగ్రెస్ స్వాగతించింది. సామాజిక న్యాయం చేయడానికి, సామాజిక సాధికారత కోసం జాతీయ స్థాయిలో ఇలాంటి కసరత్తు చేయాలని కేంద్రాన్ని కోరింది.
బీహార్‌లో కులగణన సర్వే నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు (OBCs), అత్యంత వెనుకబడిన తరగతులు (Extremely Backward Classes- EBCs) కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్లు నివేదికలో తేలింది.
బైక్ దొంగిలిచాడని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన బీహార్‌లోని వైశాలిలో జరిగింది. స్థానికులు చెట్టుకు కట్టేసి రక్తమొచ్చేటట్టు చితకబాదారు. అతన్ని అలా కొడుతుండగా.. కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని చెట్టు నుంచి విడిపించారు.
Ambulance stopped 1 Hour for Bihar CM Nitish Kumar’s Convoy: తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిన్నారిని తరలిస్తున్న అంబులెన్స్‌ను సుమారు గంట పాటు పోలీసు అధికారులు ఆపేశారు. సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను ఆసుపత్రికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన పాట్నాలో శనివారం చోటుచేసుకుంది. పాట్నా సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను ఆపడంతో.. అనారోగ్యంతో ఉన్న చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఈ ఘటనకు సంబందించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో…
బీహార్‌లోని దర్భంగాలో హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై మహిళా పోలీసు అధికారి లాఠీచార్జి చేసింది. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా భాగల్పూర్లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని చెప్పుతో చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు కానిస్టేబుల్‌తో గొడవ పడి.. కానిస్టేబుల్ యూనిఫాం చించేశాడు.