Bihar Caste survey: బీహార్‌లో కులగణన సర్వే నివేదిక విడుదల.. ఓబీసీ, ఈబీసీలు 63%
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో కులగణన సర్వే నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు (OBCs), అత్యంత వెనుకబడిన తరగతులు (Extremely Backward Classes- EBCs) కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్లు నివేదికలో తేలింది. ఈ నివేదికను రాష్ట్ర డెవలప్‌మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ సోమవారం విడుదల చేశారు. తాజా నివేదిక ప్రకారం బీహార్ లో జనాభా దాదాపు 13.07 కోట్లు ఉన్నారు. అందులో అత్యంత వెనుబడిన తరగతుల (EBCs) వారు 36 శాతంగా ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల (OBCs) వారి వాటా 27.13 శాతంగా ఉన్నట్లు రిపోర్డులో తేలింది. ఇక.. కులాలవారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని రిపోర్టు తెలిపింది. రాష్ట్ర జనాభాలో వీరి వాటా 14.27 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. షెడ్యూల్డ్ కులాల (SCs) జనాభా 19.7 శాతం ఉండగా.. షెడ్యూల్డ్ తెగల (STs) జనాభా 1.7 శాతంగా నమోదైంది. జనరల్ కేటగిరీకి చెందినవారి జనాభా 15.5 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Vande Bharat Express: వందేభారత్ రైలుని పట్టాలు తప్పించే కుట్ర.. ట్రాకుపై రాళ్లు, ఇనుపకడ్డీలు…
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్రం చేసిన వ్యాఖ్యలపై.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. తమ రాష్ట్రంలో కులగణన చేపడతామని గత ఏడాది జూన్‌లో తెలిపారు. దీంతో ఈ ఏడాది జనవరిలో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో, రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని న్యాయస్థానం కొట్టివేసి సర్వేకు అనుమతించింది. అంతటితో ఆగకుండా ఈ విషయం సుప్రీంకోర్టు తలుపులను కూడా తట్టింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది.
PM Modi: ప్రతిపక్షాలు కులం, మతం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయి
కులగణన నివేదిక నేపథ్యంలో.. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం నీతీశ్ కుమార్ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో కులగణన నివేదికపై చర్చిస్తామని.. ఓబీసీ కోటా పెంపు సహా ఇతర అంశాలపై సమాలోచనలు జరుపుతామని నితీశ్ కుమార్ తెలిపారు.
- Tags
- bihar
- Caste survey
- ebc
- OBC
- release
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?